Rohit Sharma takes DRS after Umpire given Wide: ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 158 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో 162 రన్స్ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (40; 19 బంతుల్లో 4×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యకుమార్‌ యాదవ్ (34 నాటౌట్‌; 18బంతుల్లో 5×4, 1×6) మరోసారి జట్టును ఆదుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్‌ (61; 43 బంతుల్లో 4×4, 5×6) హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఈ మ్యాచులో ఓ సరదా ఘటన చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెస్టిండీస్‌ బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌ను స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేశాడు. ఆ ఓవర్‌లోని అయిదో బంతిని వెస్టిండీస్ బ్యాటర్ రోస్టన్ ఛేజ్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. ఛేజ్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేయగా.. అది బ్యాట్‌కు తగలకుండా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. వెంటనే ఔట్ కోసం టీమిండియా అప్పీల్ చేయగా.. అంపైర్‌ వైడ్‌ సిగ్నల్ ఇచ్చాడు. అయితే బంతి బ్యాట్‌కు తాకిందనే నమ్మకంతో బిష్ణోయ్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మను సమీక్ష కోరామని అడిగాడు. 


అదే సమయంలో లెగ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకి కాస్త కోపం వచ్చింది. 'ఇది వైడ్ ఎలా ఇస్తారు' అంటూ గట్టిగా అరవడం స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. పక్కనే ఉన్న విరాట్ కోహ్లీ సౌండ్ వచ్చిందని చెప్పడంతో రోహిత్ డీఆర్‌ఎస్ కోరాడు. రిప్లేలో బంతి బ్యాట్‌ను కాకుండా.. ప్యాడ్‌ను తాకినట్లు తేలింది. దీంతో అంపైర్‌ అది వైడ్‌ కాదని ప్రకటించాడు. దీంతో డీఆర్‌ఎస్ కూడా వృథా కాలేదు.మొత్తానికి వికెట్‌ కోసం డీఆర్‌ఎస్ కోరితే.. వైడ్‌ రూపంలో భారత్‌కు కలిసొచ్చింది.



ఈ మ్యాచులో యువ లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 17 రన్స్ ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. బిష్ణోయ్‌ ఇచ్చిన 17 పరుగుల్లో 6 వైడ్స్ ఉండడం విశేషం. అతడు ఏకంగా 17 డాట్ బాల్స్ విసిరాడు. బిష్ణోయ్‌ భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ20 ద్వారానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. 


Also Read: Ranji Trophy Yash Dhull: ఒక్క మ్యాచ్‌తోనే.. సచిన్, రోహిత్ సరసన భారత అండర్ 19 స్టార్!!


Also Read: Son of India: ఆ ఇద్దరు హీరోలే ఇదంతా చేస్తున్నారు.. వారికి శిక్ష తప్పదు! మోహ‌న్ బాబు వార్నింగ్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook