IND vs WI, 1st test Highlights: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలి రోజు భారత బౌలర్లు చెలరేగితే.. రెండో రోజు టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు. తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ (143 బ్యాటింగ్; 350 బంతుల్లో 14  ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (103; 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. దీంతో మన జట్టుకు 162 రన్స్ ఆధిక్యం లభించనట్లయింది. యశస్వి, విరాట్ కోహ్లీ (36) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ (West Indies) 150 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవర్‌ నైట్ స్కోర్‌ 80/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత ఓపెనర్లు.. తొలి సెషన్‌లో ఆచితూచి ఆడారు. కరేబియన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రోహిత్, యశస్వి డిఫెన్స్ కే పరిమితమయ్యారు. సింగిల్స్‌తో స్ట్రెక్‌రోటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో ఓ పుల్‌ షాట్‌తో అరంగేట్ర బ్యాటర్‌ యశస్వి జైస్వాల్ 104 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జోసెఫ్‌ బౌలింగ్‌లోనే రోహిత్‌ కూడా  సిక్స్‌, ఫోర్‌ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 146/0తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. 


భోజన విరామం తర్వాత క్రీజులోకి వచ్చిన భారత ఓపెనర్లు కాస్త దూకుడు పెంచారు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ 215 బంతుల్లో టెస్టుల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్‌ కూడా 220 బంతుల్లో టెస్టుల్లో పదో సెంచరీని సాధించాడు. శతకం సాధించిన తర్వాత బంతికే రోహిత్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన  శుభ్‌మన్ గిల్ (6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. టీ బ్రేక్‌ సమయానికి భారత్ 245/2తో నిలిచింది. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి యశస్వి ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. వీరిద్దరూ నిలకడగా సింగిల్స్‌ తీస్తూ జట్టు స్కోరు 300 దాటించారు. 


**భారత ఓపెనర్లు స్వదేశానికి అవతల ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించడం 8 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2015లో శిఖర్ ధావన్, మురళీ విజయ్ జోడీ బంగ్లాదేశ్‌పై ఈ ఫీట్ చేశారు. రోహిత్‌-యశస్వి (229) కొత్త ఓపెనింగ్‌ రికార్డును నెలకొల్పారు. ఆసియాకు అవతల తొలి వికెట్కు టీమిండియాకిదే అత్యధిక భాగస్వామ్యం. చేతన్‌ చౌహాన్‌-గవాస్కర్‌ (213, ఇంగ్లాండ్‌పై, 1979) రికార్డును ఈ జోడీ చెరిపేసింది. 


Also read: IND vs WI 1st Test: అశ్విన్, జడేజా దెబ్బకి విండీస్ విలవిల.. తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook