IND vs WI 2nd T20: టీమిండియాదే బ్యాటింగ్.. దీపక్, వెంకీ ఫిట్! పొలార్డ్‌కు ప్రత్యేక మ్యాచ్!!
IND vs WI 2nd T20 Toss: భారత్, వెస్టిండీస్ మధ్య మరికొద్దిసేపట్లో ఆరంభం కానున్న రెండో టీ20 మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ సారథి కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫ్యాబియాన్ అలెన్ స్థానంలో జేసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు.
IND vs WI 2nd T20 Playing 11 is Out: మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మరికొద్దిసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన విండీస్ సారథి కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫ్యాబియాన్ అలెన్ స్థానంలో జేసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు. టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. గాయపడిన దీపక్ చహర్, వెంకటేష్ అయ్యర్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ పొలార్డ్‌కు ఎంతో ప్రత్యేకం. అతడు విండీస్ తరఫున 100 టీ20 మ్యాచ్ ఆడుతున్నాడు.
టీ20 సిరీస్‌లో ఇప్పటికే వెస్టిండీస్‌పై ఓ మ్యాచ్ గెలిచిన భారత్.. రెండో టీ20 కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీసు రేసులో నిలవాలని పోలార్డ్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లలో హిట్టర్లు ఉన్న నేపథ్యంలో భారీ స్కోర్ ఖాయంగా కనిపిస్తోంది. భారత్ 160-170 స్కోర్ చేస్తేనే ఇక్కడ విజయ అవకాశాలు ఉన్నాయి.
ఈడెన్‌గార్డెన్స్ మైదానంలోని పిచ్ ఎప్పుడూ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. తొలి టీ20లో ఇది నూటికి నూరు శాతం రుజువైంది కూడా. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. లక్ష్య ఛేదనలో బౌలింగ్ చేసే జట్టుకు కాస్త ఇబ్బంది ఉంటుంది. బంతిపై గ్రిప్ అంతగా ఉండదు. క్రీజులో కుదురుకున్న బ్యాటర్ ఈ పిచ్‌పై మంచి స్కోరు చేయచ్చు. ఇక వాతావరణం పొడిగా ఉన్నందున.. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పు లేదు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రొమన్ పావెల్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హొసెన్, షెల్డన్ కాట్రెల్.
Also Read: Pushpa Srivalli Dance: ఈ తల్లీ బిడ్డల డాన్స్ చూస్తే.. అల్లు అర్జున్ కూడా ఫిదా అవ్వాల్సిందే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook