IND Vs WI: అరుదైన ప్రపంచ రికార్డుకు చేరువలో కోహ్లీ, రోహిత్.. గప్తిల్‌ను దాటేందుకు మనోళ్ల మధ్యనే ఫైట్!!
Virat Kohli, Rohit Sharma T20I record: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును తన పేరుపై లికించుకునేందుకు ఈరోజు భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య ఫైట్ జరగనుంది.
Virat Kohli needs 56 runs to became Highest T20I scorer: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌పై కూడా కన్నేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. రెండో టీ20లో కూడా విజయం సాధించాలని చూస్తోంది. మరికొద్దిసేపట్లో కోల్‌కతాలో భారత్, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీ ఓ అరుదైన ప్రపంచ రికార్డుపై కన్నేశారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును తన పేరుపై లికించుకునేందుకు ఈరోజు భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య ఫైట్ జరగనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ వెటరన్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గుప్తిల్ ఇప్పటివరకు 112 మ్యాచ్‌లు ఆడి 32 సగటుతో 3299 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 105.
మార్టిన్ గుప్తిల్‌ను అధిగమించి టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు విరాట్ కోహ్లీకి 56 పరుగులు అవసరం. ఈ మ్యాచులో కోహ్లీ హాఫ్ సెంచరీ (56) చేస్తే ఆ రికార్డు సొంతం కానుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఇప్పటివరకు 96 టీ20 మ్యాచులు ఆడి.. 51 సగటుతో 3244 రన్స్ చేశాడు. ఇందులో 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 94 పరుగులు. గత కొంత కాలంగా పరుగులు చేయలేకపోతున్న కోహ్లీ.. ఈ రోజు ఆ రికార్డు అందుకుంటాడో లేదో చూడాలి.
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు రోహిత్ శర్మకు 63 పరుగులు కావాలి. టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 120 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 33 సగటుతో 3237 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హిట్‌మ్యాన్ అత్యధిక స్కోర్ 118. టీ20 అంటేనే రెచ్చిపోయే రోహిత్.. ఈరోజు ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. తొలి టీ20 మాదిరి రెచ్చిపోతే సునాయాసంగా 63 రన్స్ చేస్తాడు. గత కొంతకాలంగా రోహిత్, కోహ్లీలు పలు రికార్డులు నెలకొల్పుతున్న విషయం తెలిసిందే.
Also Read: Pushpa Srivalli Dance: ఈ తల్లీ బిడ్డల డాన్స్ చూస్తే.. అల్లు అర్జున్ కూడా ఫిదా అవ్వాల్సిందే!!
Also Read: Chinna Jeeyar Swamy: సీఎం కేసీఆర్‌తో విభేదాలపై చినజీయర్ స్వామి రియాక్షన్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook