India Win Series 1-0 After Match Drawn: టీమిండియా గెలుపును వరుణుడు అడ్డుకున్నాడు. వెస్టిండీస్ జట్టును ఓటమి నుంచి గట్టెక్కిస్తూ.. తాను విజయం సాధించాడు. రెండో టెస్టు ఐదో రోజు పూర్తిగా వర్షార్పణం అయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి టెస్టులో విజయం సాధించిన భారత్.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో టెస్టులో కూడా విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనుకున్న భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. నాలుగో రోజు 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటికి విండీస్ గెలుపునకు 289 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్ విజయానికి 8 వికెట్లు అవసరం. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (16), బ్లాక్‌వుడ్ (20) నాటౌట్‌గా నిలిచారు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు అశ్విన్ ఖాతాలోకే పడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన మహ్మద్ సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 
 
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండయా 438 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (121) సెంచరీ సాధించగా.. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 255 పరుగులకే భారత బౌలర్లు కుప్పకూల్చారు. 183 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. 2 వికెట్ల నష్టానికి 181 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్‌ శర్మ (57), ఇషాన్‌ కిషన్‌ (52 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు. 7.5 రన్‌రేట్‌తో టీమిండియా పరుగులు సాధించడం విశేషం. 


ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్‌తో స్టేడియంలో ప్రేక్షకులను అలరించాడు. రిషబ్ పంత్ స్టైల్లో ఒంటి చెత్తో సిక్సర్ బాదడంతో పాటు హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ (38) ఆకట్టుకోగా.. శుభ్‌మన్‌ గిల్ (29) నాటౌట్‌గా నిలిచాడు. తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ విజయాన్ని అందుకోగా.. రెండో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో సొంతం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌కు రెడీ కానుంది. మూడు వన్డేల సిరీస్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది.  


Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!  


Also Read: CM Jagan Mohan Reddy: రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకతంగా నిలిచిపోయే రోజు: సీఎం జగన్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి