India vs West Indies Playing 11: వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసేందుకు రోహిత్ సేన రెడీ అయింది. మొదటి టెస్టు గెలిచిన ఊపుమీద ఉన్న టీమిండియాకు విండీస్ జట్టు ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక టెస్టులో అయినా తమ జట్టు రాణించాలని కరేబియన్ అభిమానులు కోరుకుంటున్నారు. డొమినికా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా.. చివరిలో టెస్టులోనూ అదే ఫామ్ కంటిన్యూ చేయాలన చూస్తోంది. ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో గురువారం తలపడనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభంకానుంది. డీడీ స్పోర్ట్స్, జియో సినిమాస్ యాప్‌లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు భారత్-విండీస్ జట్ల మధ్య 99 టెస్టులు జరగ్గా.. ఇందులో కరేబియన్ జట్టుదే పైచేయిగా ఉంది. వెస్టిండీస్ 30 టెస్టుల్లో, భారత్ 23 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా.. 46 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే 100వ టెస్టులో టీమిండియాదే విజయం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న భారత్‌కు విండీస్ కనీస పోటీ ఇవ్వడం కూడా కష్టంగా మారింది. ఈ మ్యాచ్‌ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.  


తొలి టెస్టును ఇన్నింగ్స్‌ తేడాతో సొంతం చేసుకున్న భారత్.. రెండో టెస్టుకు పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అద్బుత ఫామ్‌లో ఉండడంతో ఎలాంటి ఢోకా లేదు. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్ సెట్ అవ్వాల్సి ఉంది. విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. గత మ్యాచ్‌లో విఫలమైన వైస్ కెప్టెన్ అజింక్యా రహానే బ్యాట్‌తో రాణించాల్సిన అవసరం ఉంది. యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు గత మ్యాచ్‌లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఛాన్స్ వస్తే.. సత్తా చాటుకోవాలని ఇషాన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బంతితో ఆకట్టుకున్నాడు.


తొలి టెస్టులో పెద్దగా రాణించలేకపోయిన మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్.. పేసర్లకు సహరించే ట్రినిడాడ్ పిచ్‌పై చెలరేగాల్సిన అవసరం ఉంది. పిచ్‌తో సంబంధం లేకుండా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోతున్నాడు. గత మ్యాచ్‌లో 12 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మరోసారి అశ్విన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. 


అటు వెస్టిండీస్ టీమ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొంటోంది. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ భారీ ఇన్నింగ్స్ ఆడాలని సంకల్పంతో ఉన్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లో ఆకట్టుకున్న అలిక్ అథనేజ్‌పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఆల్‌రౌండర్‌ రఖీమ్‌ కార్న్‌వాల్‌ ప్లేస్‌లో సింక్లయిర్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండడంతో మరో స్పిన్నర్‌ వారికన్ స్థానంలో పేసర్‌ గాబ్రియల్‌ను తీసుకోవచ్చు.


రెండో టెస్టుకు తుది జట్లు (అంచనా)


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.
 
వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అతానాజ్, త్యాగ్‌నారాయణ్‌ చంద్రపాల్, కిర్క్‌ మెకంజీ, హోల్డర్‌, జాషువా డా సిల్వా, రఖీమ్‌ కార్న్‌వాల్‌/సింక్లయిర్‌, అల్జారీ జోసెఫ్‌, కీమర్‌ సిన్రికాన్ రోచ్‌, గాబ్రియల్‌/వారికన్‌.


Also Read: Manipur Violence: మణిపూర్‌లో భయంకరమైన వీడియో.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. దారుణం..!  


Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook