టీమిండియాదే బ్యాటింగ్.. ఒక మార్పుతో బరిలోకి భారత్! ఇషాన్, దీపక్‌కు నిరాశే
India vs West Indies 3rd ODI Playing 11 out. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.
IND vs WI 3rd ODI Playing 11 out: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. అవేష్ ఖాన్ స్థానంలో ప్రసిద్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. జట్టులో చోటు ఆశించిన ఇషాన్ కిషన్, దీపక్ హుడాకు నిరాశే ఎదురైంది. ఇక అర్ష్‌దీప్ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తాడని భావించినా.. తుది జట్టులో స్థానం దక్కలేదు.
మరోవైపు విండీస్ మూడు మార్పులు చేసింది. అల్జారీ, రోవ్‌మాన్ మరియు షెపర్డ్ స్థానంలో హోల్డర్, కీమో, కార్టీ జట్టులోకి వచ్చారు. తొలి రెండు మ్యాచుల్లో విజయం వరకు వచ్చి అనూహ్యంగా ఓటమిపాలైన విండీస్.. పరువు నిలిచేలా మూడో వన్డేలో గెలవాలని చూస్తోంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. హోల్డర్, కీమో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఇటీవల పరిమితి ఓవర్ల ఫార్మాట్‌లో భారత్ వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ను దాని సొంతగడ్డపై ఓడించిన భారత్.. వెస్టిండీస్ భరతం పడుతున్నది. ఇప్పటికే వన్డే సిరీస్ ఖాతాలో వేసుకున్న టీమిండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. విండీస్‌పై వరుసగా 12వ సిరీస్ విజయంతో కొత్త రికార్డు నెలకొల్పిన భారత్.. అదే జోష్‌లో ఆఖరి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని చూస్తున్నది.
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్, ప్రసిధ్ కృష్ణ.
వెస్టిండీస్: షై హోప్, బ్రాండన్ కింగ్, కీసీ కార్టే, బ్రూక్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), కైల్ మయేర్స్, జాసన్ హోల్డర్, కీమో పాల్, అకీల్ హోసీన్, హేడెన్ వాల్ష్, జయ్‌డెన్ సీలెస్.
Also Read: అబ్బాయి 7 అడుగులు, అమ్మాయి 5 అడుగులు.. పూలదండ వేసేందుకు వధువు పడిన కష్టాలు చూడండి!
Also Read: ఏడాదిలోనే బ్రేకప్ చెప్పేసిన హీరోయిన్.. మూన్నాళ్ల ముచ్చటే అయిందిగా!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook