ఇండియా vs విండీస్ 5వ వన్డే: తిరువనంతపురం వన్డే మ్యాచ్ ప్రివ్యూ
IND vs WI 5Th ODI : ఆఖరి వన్డే మ్యాచ్ వివరాలు క్లుప్తంగా
రేపు గురువారం తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో విండీస్‌తో జరగనున్న 5వ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు క్రికెట్ ప్రియుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ సేన విండీస్‌తో తలపడనున్న ఈ చివరి వన్డేను వీక్షించేందుకు క్రికెట్ ప్రియులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో టికెట్స్ అమ్ముడుపోగా.. రేపు మొదటి బంతి విసిరేలోపు.. స్టేడియంలో చివరి టికెట్ సైతం అమ్ముడవుతుందని కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) విశ్వాసం వ్యక్తంచేస్తోంది.
రేపటి 5వ వన్డేలో ఆడనున్న టీమిండియా ఆటగాళ్ల జాబితా:
విరాట్ కోహ్లీ (కెప్టేన్), రోహిత్ శర్మ (వైస్-కెప్టేన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, రిశబ్ పంత్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మెద్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే.
మ్యాచ్ వేదిక:
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం.
తేదీ, సమయం:
నవంబర్ 1, గురువారం, మధ్యాహ్నం 1:30 గంటలకు.
ఏ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది:
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్ ఈ వన్డే మ్యాచ్‌ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
మ్యాచ్ ప్రారంభమైన అనంతరం లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ కింది లింకును క్లిక్ చేయండి.
https://www.cricketcountry.com/series/west-indies-in-india-2018-200975/live-scores/india-vs-west-indies-5th-odi-match-187766-summary.html