India Squad for West Indies Tour: వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో పాటు మూడు వన్డేలను టీమిండియా ఆడనుంది. అనంతరం ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ కూడా జరుగుతుంది. ఈ ఫార్మాట్‌కు సంబంధించిన జట్టును తర్వాత ప్రకటించనున్నారు. రెండు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్‌ను ప్రకటించారు. వన్డే టీమ్‌కు హర్ధిక్ పాండ్యా, టెస్ట్ జట్టుకు అజింక్యా రహానే వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెస్టు జట్టు విషయానికి వస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో విఫలమైన ఛెతేశ్వర్ పుజరాపై వేటు పడింది. అందరూ ఊహించినట్లు యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ టెస్టు జట్టులోకి వచ్చాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే మళ్లీ వైస్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా చోటు దక్కించుకున్నాడు. మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి విండీస్ టూర్‌ నుంచి విశ్రాంతి ఇచ్చారు. నవదీప్ సైనీకి టెస్టు జట్టులో చోటు కల్పించారు. రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ వన్డేలతోపాటు టెస్టు జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.


వన్డే జట్టులో సంజూ శాంసన్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. జయదేవ్ ఉనద్కత్‌, ఉమ్రాన్ మాలిక్‌ను కూడా వన్డే టీమ్‌లోకి ఎంపిక చేశారు. రెండు ఫార్మాట్లలోనూ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగానికి నేతృత్వం వహించనున్నాడు. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ద్వయం స్పిన్ బాధ్యతలు పంచుకోనుండగా.. ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.


Also Read: Titanic Submarine: చివరికి విషాదాంతం.. టైటాన్ సబ్‌మెరైన్‌లో ఐదుగురు మృతి



 



టెస్ట్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, ఆర్.జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.


వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.



Also Read: Underwater Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్‌లో అండర్ వాటర్ మెట్రో.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook