IND vs WI: ప్రాక్టీస్ లేకుండా బరిలో దిగడం కష్టం.. టీమిండియాలో అతడి రీఎంట్రీ అంత ఈజీ కాదు: భజ్జీ
Harbhajan Singh about Kuldeep Yadav: భారత వన్డే జట్టులోకి తిరిగొచ్చిన కుల్దీప్ యాదవ్‌కు ముందున్నదంతా కఠిన మార్గమేనని హర్భజన్ సింగ్ అన్నారు.
Harbhajan Singh about Kuldeep Yadav: త్వరలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. గాయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్ ఈ సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ వన్డే, టీ20లకు ఎంపిక కాగా.. ఆల్‌రౌండర్ దీపక్ హుడా వన్డేల్లో చోటు సంపాదించాడు. ఇక చాన్నాళ్ల నుంచి జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.
భారత వన్డే జట్టులోకి తిరిగొచ్చిన కుల్దీప్ యాదవ్‌కు ముందున్నదంతా కఠిన మార్గమేనని టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ (Harbhajan Singh) అన్నారు. ''కుల్దీప్ యాదవ్‌కు ముందున్నదంతా కఠినమైన మార్గం. గత కొంతకాలంగా అతడు దేశవాళీ మ్యాచ్‌లు ఆడలేదు. అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయడం అంత సులువు కాదు. మోకాలి శస్త్రచికిత్సకు ముందు కూడా కుల్దీప్ క్రమం తప్పకుండా ఆడలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేస్తున్నప్పుడు మెదడులో వచ్చే మొదటి ఆలోచన.. నా బౌలింగ్‌లో బాదకూడదు అనే. ఇది మానసిక దృఢత్వానికి పరీక్ష' అని భజ్జీ అన్నారు.
Also Read: Rajinikanth: ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి సూపర్ స్టార్ ప్రయత్నాలు.. ఫోన్ చేసి మరీ..!!
'నేను ఒకటి మాత్రం చెప్పగలను.. కుల్దీప్ యాదవ్ ఆరంభంలోనే రెండు వికెట్లు తీసుకుంటే అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే మనం అనుకున్న విషయాలు జరగకపోవచ్చు. ఏదేమైనా అతను లయను తిరిగి పొందడానికి కొంత సమయం పట్టవచ్చు. కుల్దీప్ గత ప్రదర్శనల ఆధారంగా నేను ఒకటి సూచించగలను.. అతనికి తగినంత సమయం మరియు విశ్వాసం ఇవ్వాలి. కుల్దీప్ టీమిండియాకు విజయాలు అందించగలడు' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు.
'నా ఫేవరెట్ బ్యాటర్ రోహిత్ శర్మ. టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా గొప్పగా రాణించగలడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. టీమిండియా బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయగలడనే నమ్మకం ఉంది. బహుశా ప్రపంచంలోనే రోహిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అనుకుంటున్నాను. అలాఅని విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లను తక్కువగా అంచనా వేయడం లేదు. వాళ్లిద్దరు కూడా మెరుగ్గానే రాణిస్తున్నారు. కానీ రోహిత్ తన బ్యాటింగ్‌తో ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు' అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
Also Read: Eesha Rebba Saree Pics: గ్లామర్ డోస్ పెంచేసిన ఈషా రెబ్బా.. తెలుగు అందం అదిరిందబ్బా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook