KL Rahul and Axar Patel ruled out of T20I Series: వెస్టిండీస్‌తో త్వరలో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ పొట్టి సిరీస్‌కు దూరమయ్యారు. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ టీ20 సిరీస్‌ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ ట్విట్టర్ ఖాతా ద్వారా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. రాహుల్, అక్షర్ స్థానాల్లో బీసీసీఐ యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఫిబ్రవరి 16 నుంచి కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్ లోకేష్ రాహుల్ మరియు ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ దూరమయ్యారు. వీరి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్ మరియు దీపక్ హుడాలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. రుతురాజ్, హుడా ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. హుడా రెండు వన్డేలు ఆడగా.. రుతురాజ్ ఒక్క మ్యాచ్ ఆడలేదు.


వెస్టిండీస్‌తో ఫిబ్రవరి 9న జరిగిన 2వ వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు లోకేష్ రాహుల్‌ ఎడమ చేతికి గాయం అయింది. అక్షర్ పటేల్ ఇటీవల కోవిడ్-19 నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పునరావాసం కోసం వెళ్లనున్నారు. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ప్రస్తతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ అనంతరం ఫిబ్రవరి 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. 18, 20 తేదీల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనే మిగతా రెండు మ్యాచులు జరగనున్నాయి. 


భారత టీ20 జట్టు: 
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, మొహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా.


Also Raed: Hijab Controversy: సుప్రీం కోర్టుకు హిజాబ్ వివాదం.. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్లు


Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ?.. లైవ్‌ స్ట్రీమింగ్‌ డీటెయిల్స్ ఇవే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook