Hijab Controversy: సుప్రీం కోర్టుకు హిజాబ్ వివాదం.. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్లు

Hijab Controversy Case: హిజాబ్ వివాదంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 12:23 PM IST
  • సుప్రీం కోర్టుకు చేరిన హిజాబ్ వివాదం
  • కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్లు
  • హైకోర్టు ఆదేశాలు ప్రాథమిక హక్కును ఉల్లంఘించేలా ఉన్నాయన్న పిటిషనర్లు
Hijab Controversy: సుప్రీం కోర్టుకు హిజాబ్ వివాదం.. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్లు

Hijab Controversy Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హిజాబ్ వివాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వ్యక్తుల, ముఖ్యంగా ముస్లిం విద్యార్థినుల ప్రాథమిక హక్కును ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని కోరారు.

మతపరమైన దుస్తులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ముస్లిం విద్యార్థినులపైనే ప్రభావం చూపుతాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇది విద్యార్థుల మధ్య అసమంజసమైన వర్గీకరణకు దారితీస్తుందన్నారు. ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉన్న తరుణంలో హిజాబ్‌పై నిషేధం విధించడం.. ముస్లిం విద్యార్థినుల చదువుకు ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్నారు. కర్ణాటక కాంగ్రెస్ యూత్ లీడర్ బీవీ శ్రీనివాస్ కూడా హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ని ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

హిజాబ్ వివాదంపై ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో తుది తీర్పు వెలువడేంత వరకు విద్యా సంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హిజాబ్ వివాదంతో ఆందోళనలు చెలరేగి విద్యా సంస్థలు మూతపడగా.. వాటి పున:ప్రారంభానికి హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరడంతో సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో మూడో వన్డే.. ఎంఎస్ ధోనీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ!!

Also Read: TS SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్... పరీక్షల షెడ్యూల్‌పై ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News