IND vs WI: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై ప్రస్తుత కెప్టెన్​ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్నాళ్లు కోహ్లీని ప్రశాంతంగా వదిలేస్తే.. అంతా సర్దుకుంటుందని చెప్పుకొచ్చాడు. అతడు కాన్ఫిడెన్స్ కోల్పోలేదని.. ఒత్తిడిని జయించడం ఎలానో కూడా అతడికి బాగా తెలుసు అని చెప్పుకొచ్చాడు. అతడు టీమ్​ ఇండియా కోసం ఎంతే శ్రమించాడని గుర్తు చేసుకున్నాడు రోహిత్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు వదిలేస్తే..


రేపటి నుంచి కోల్​కతా ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా వెస్టిండీస్​తో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్​ శర్మ కోహ్లీ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు.


కోహ్లీ ఫామ్​, వివాదాల గురించి వస్తున్న వార్తలకు కారణం మీడియానే అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. మీరు (మీడియా) కొన్నాళ్లు అతని గురించి (కోహ్లీ గురించి) పట్టించుకోకుంటే.. అన్ని అవే సర్దుకుంటాయని అభిప్రాయపడ్డాడు.


ఇక కోహ్లీ ఫామ్​ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు రోహిత్​. కోహ్లీ ఒత్తిడిలో ఉన్నాడన్న వార్తలను ఖండిచాడు. కోహ్లీ పదేళ్లకుపైగా ఇంటర్నేషనల్ టీమ్​లో ఉన్నాడన్నాడు రోహిలత్​. ఇక అంతర్జాతీయ మ్యాచ్​లలో చాలా టైమ్​ కేటాయించాడని కాబట్టి ఒత్తిడిని ఎలా అదుపులో ఉంచుకోవాలో కోహ్లీకి చాలా బాగా తెలుసని స్పష్టం చేశాడు. మళ్లీ మళ్లీ కోహ్లీ ఫామ్​ గురించి అడగటం బాగోలేదని రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు.


ఇంటర్నేషనల్ మ్యాచ్​లలో కోహ్లీ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. వన్డే ఫార్మాట్​లో ఒక్క సెంచరీ కూడా నమోదు  చేయలేదు. అయితే కోహ్లీ రికార్డు స్థాయిలో ఇప్పటిప వరకు 44 సెంచరీలు చేయడం విశేషం.


ఇక టీ20 మ్యాచ్​లు ఇలా..


రేపటి నుంచి (ఫిబ్రవరి 16) ఇండియా-వెస్టిండీస్​ మధ్య టీ20 మ్యాచ్​లు జరగనున్నాయి. మూడు మ్యాచ్​లు కోల్​కతా వేదికగానే జరగనున్నాయి. ఇప్పటికే వన్డేలో వెస్టిండీస్​ను 3-0 తేడాతో ఓడించిన టీమ్ ఇండియా.. టీ20లోనూ ఆదిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ఇక వన్డే సిరీస్​తో భంగపాటుకు గురగైన విండీస్​ జట్టు.. ఈ సిరీస్​లో ప్రతీకారం తీసుకోవాలని భావిస్తోంది.


Also read: Maxwell Wedding Card: భారతీయురాలితో క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వివాహం.. వెడ్డింగ్ కార్డు వైరల్!


Also read: India vs West Indies : టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook