Team India Test Squad: వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా రెడీ అవుతోంది. కరేబియన్ జట్టుతో జూలె 12వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్‌ మొదలు కానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ డొమినికా వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌లో ముగ్గురు యంగ్ ప్లేయర్లు జట్టులో చోటు సంపాదించుకోగా.. ఇద్దరు సీనియర్లపై వేటు పడింది. ఛెతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌లను సెలక్టర్లు పక్కనబెట్టగా.. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మరో నలుగురు భారత క్రికెటర్లకు టెస్టు క్రికెట్‌లో తలుపులు మూసుకుపోయాయి. ఆ నలుగురు ఎవరంటే..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భువనేశ్వర్ కుమార్


2012లో టీమిండియాకు ఎంపికైన భువనేశ్వర తన స్వింగ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ.. ప్రత్యర్థులను బెంబేలెత్తించేవాడు. బూమ్రా-భూవీ కాంబో చాలాబాగా వర్కౌట్ అయింది. అయితే భూవీ కెరీర్‌ను గాయాలు ఇబ్బంది పెట్టాయి. 2018లో గాయం కారణంగా భువీ టెస్ట్ జట్టుకు దూరమయ్యాడు. తరువాత కోలుకున్నా మళ్లీ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 21 టెస్టు మ్యాచ్‌ల్లో 63 వికెట్లు, 121 వన్డేల్లో 141 వికెట్లు, 87 టీ20 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు తీశాడు భువనేశ్వర్. టెస్టుల తరువాత వన్డే, టీ20 జట్ల నుంచి కూడా ఈ స్వింగ్ బౌలర్‌ను తప్పించారు. 


శిఖర్ ధావన్


మరో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావర్ టెస్ట్ కెరీర్‌ కూడా దాదాపు ముగిసింది. ప్రస్తుతం ఓపెనింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్ ఫిక్స్ అయిపోయారు. బ్యాకప్‌గా కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వంటి ప్లేయర్లు రెడీగా ఉన్నారు. ధావన్ చివరిసారిగా 2018లో భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్‌ ఆడాడు. 34 టెస్ట్ మ్యాచ్‌ల్లో 40.61 సగటుతో 2315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 167 వన్డేల్లో 6793, 68 టీ20 మ్యాచ్‌ల్లో 1759 రన్స్ చేశాడు.


వృద్ధిమాన్ సాహా


వృద్ధిమాన్ సాహా చాలా మంచి వికెట్ కీపర్. టెస్టు క్రికెట్‌లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. 2010లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన సాహా.. ఇప్పటివరకు 40 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 38 ఏళ్ల వృద్ధిమాన్ సాహాను సెలక్టర్లు పక్కనబెట్టి చాలా కాలమైంది. రిషబ్ పంత్ గాయపడడంతో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ వంటి యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకుంది. వృద్ధిమాన్ సాహా కెరీర్ దాదాపు ముగిసినట్లే. 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి.


ఇషాంత్ శర్మ


టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ టెస్టు కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. చివరిసారిగా నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో ఆడిన ఇషాంత్.. మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఫాస్ట్ బౌలర్లలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వంటి ప్లేయర్లు రాణిస్తుండడంతో ఇషాంత్‌కు చోటు కష్టమైంది. ఇషాంత్ శర్మ 100కి పైగా టెస్టులు ఆడి.. 311 వికెట్లు పడగొట్టాడు. 


Also Read: AP Pension Scheme: జగన్ సర్కారు శుభవార్త.. త్వరలో రెండో పెన్షన్‌..?   


Also Read: Pension Scheme For Unmarried: పెళ్లికాని వారికి గుడ్‌న్యూస్.. పెన్షన్ పథకం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook