Team India Playing 11 For 1st Test: ఈ నెల 12వ తేదీ నుంచి వెస్టిండీస్ టూర్‌ను టీమిండియా ప్రారంభించనుంది. డొమినికా వేదికగా మొదటి టెస్ట్ ఆరంభంకానుంది. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ముఖేష్‌ కుమార్ వంటి యంగ్ ప్లేయర్లు తొలిసారి జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్లేయింగ్‌లో ఎలెవన్‌లో ఎవరు ఉంటారు..? పూజారా స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు ఎవరు వస్తారు..? వికెట్ కీపర్‌గా ఎవరిని తీసుకుంటారు..? అనేది ఆసక్తికరంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి రావడం ఖాయమైంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్‌ను పుజారా స్థానంలో వన్‌డౌన్‌లో ఆడించే అవకాశం ఉంది. గిల్ ఈ ప్లేస్‌లో ఫిక్స్ అయిపోతే ఇక పుజారాకు తలుపులు మూసుకుపోతాయి. రోహిత్-జైస్వాల్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్‌ సెట్ అవుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో జైస్వాల్ ఓపెనర్‌గానే వచ్చాడు. 76 బంతుల్లో 54 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 
 
శుభ్‌మన్ గిల్ 3వ స్థానంలో ఆడనుండగా.. విరాట్ కోహ్లి 4వ స్థానంలో ఆడతాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానె 5వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఇక వికెట్ కీపింగ్ ప్లేస్‌ కోసం కేఎస్‌ భరత్, ఇషాన్ కిషన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రిషబ్ పంత్ జట్టుకు దూరమైన తరువాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన కేఎస్ భరత్.. కీపింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నా బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఫ్లాప్ తరువాత జట్టులో స్థానం కష్టమేనని అందరూ అనుకున్నారు. కానీ ఈ యంగ్ వికెట్ కీపర్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. అయితే ఇషాన్‌ కిషన్ కూడా జట్టులో ఉండడంతో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. 


ఇషాన్ కిషన్ డైనమిక్ బ్యాట్స్‌మెన్. వేగంగా పరుగులు చేసే సత్తా ఉంది. అయితే షార్ట్ బంతులను ఎదుర్కొవడంతో బలహీనత ఆందోళన కలిగిస్తోంది. కీపింగ్ నైపుణ్యాలు కూడా టెస్టులకు అవసరమైన స్థాయిలో లేవు. వికెట్ కీపిర్ విషయంలో మ్యాచ్‌కు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయం తీసుకోనున్నారు. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఏడోస్థానంలో ఆడనున్నాడు. స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌, పేస్ బౌలర్లుగా శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్ జట్టులో ఉండే అవకాశం ఉంది. ముఖేష్ కుమార్, నవదీప్ సైనీలు అవకాశాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.


తొలి టెస్ట్‌కు టీమిండియా (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్/ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్.


Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్‌ యూటర్న్..? తాజా వ్యాఖ్యలతో కొత్త ట్విస్ట్..!  


Also Read: Tomato Price Hike: డబుల్ సెంచరీ కొట్టేసిన టమాటా.. అక్కడ కిలో రూ.250   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి