Tomato Price Hike: డబుల్ సెంచరీ కొట్టేసిన టమాటా.. అక్కడ కిలో రూ.250

Tomato Price Today: పెరుగుతున్న టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ గంగోత్రి ధామ్‌లో ఏకంగా రూ.250కి చేరింది. అయితే రాజస్థాన్‌లోని చురు జిల్లాలో కిలో రూ.31కే కిలో టమాటా లభిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2023, 07:22 AM IST
Tomato Price Hike: డబుల్ సెంచరీ కొట్టేసిన టమాటా.. అక్కడ కిలో రూ.250

Tomato Price Today: ఎప్పుడో కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు ఇంకా మోత మోగిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా దాటేసిన డబ్బులు సెంచరీ కొట్టేసిన టమాటా రోజురోజుకు రికార్డు ధరకు చేరుకుంటోంది. పెరుగుతున్న టమాట ధరలకు పేదలు, మధ్య తరగతి పూర్తిగా కొనడం మానేశారు. టమాటా లేకుండా కూరలు చేసుకుంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న టమాటా ధరలు రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో టమాటా ధరలు రికార్డు స్థాయికి చేరింది. కిలో ఏకంగా రూ.200 దాటడంతో ప్రజలు కొనాలంటనే బెంబేలెత్తిపోతున్నారు. గంగోత్రి ధామ్‌లో టమాటా కిలో 250 రూపాయలకు విక్రయిస్తుండడంతో సామాన్యులు దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. 

టమాట పండే ప్రాంతాల్లో విపరీతమైన వేడి ఒక కారణం కాగా. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో సరఫరా లేకపోవడంతో ధరలు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయని అంటున్నారు. నిత్యం పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో టొమాటో 162 రూపాయలకు విక్రయించారు. అయితే అత్యల్పంగా రాజస్థాన్‌లోని చురు జిల్లాలో కిలో 31 రూపాయలకు విక్రయించడం విశేషం. 

ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ధర కొంచెం తక్కువగా ఉంది. రూ.100 నుంచి రూ.150లోపే కిలో టమాటా లభిస్తుంది. హైదరాబాద్‌లో కిలో 100 నుంచి 120 వరకు పలుకుతోంది. బెంగుళూరులో 120 రూపాయలకుపైగా కేజీ టమాటా విక్రయిస్తున్నారు. చెన్నైలో 100 నుంచి 130 రూపాయల మధ్యలో టమాట విక్రయాలు జరుగుతున్నాయి.

టమాటా ధరలు భారీగా పెరగడంతో రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా వినియోగం బాగా తగ్గించారు. తాము ఎంత ప్రయత్నించినా నాణ్యమైన టమాటా లభించడం లేదని.. అందుకే వినియోగదారులకు రుచికరమైన ఆహారం అందించలేకపోతున్నామంటూ ఢిల్లీలో మెక్‌డొనాల్డ్స్ యాజమాన్యం బోర్డు పెట్టింది. కస్టమర్లు అర్థం చేసుకోవాలని విన్నవించింది. చాలా హోటళ్లు తమ డిషెస్‌లో కూడా టమాటా వినియోగాన్ని తగ్గించేశాయి. పెరిగిన టమాటా ధరలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా.. అని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్‌ యూటర్న్..? తాజా వ్యాఖ్యలతో కొత్త ట్విస్ట్..!  

Also Read: Yatra 2 Movie: యాత్ర 2 సినిమాపై ఎవరేమనుకున్నా ఫరవాలేదు, ఎన్నికల ముందే విడుదల

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News