IND vs ZIM Dream11 Prediction: భారత్ vs జింబాబ్వే డ్రీమ్ 11 టీమ్.. మ్యాచ్ టైమింగ్స్, స్ట్రీమింగ్ డీటెయిల్స్!
India vs Zimbabwe 2nd ODI Dream11 Team Prediction. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో సునాయాస విజయం అందుకున్న భారత్.. సిరీస్‌పై కన్నేసింది.
India vs Zimbabwe 2nd ODI Dream11 Team Prediction: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో సునాయాస విజయం అందుకున్న భారత్.. సిరీస్‌పై కన్నేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే కప్ గెలవాలని కేఎల్ రాహుల్ సేన చూస్తోంది. భారత్, జింబాబ్వే జట్ల మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. మొదటి వన్డేలో ఓడిన ఆతిథ్య జింబాబ్వే.. ఈ మ్యాచులో టీమిండియాకు కనీస పోటీ ఇవ్వాలని చూస్తోంది. భారత కాలమానం ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది. హరారె స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగే ఈ మ్యాచును.. సోని స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే నేడు భారత్ బరిలోకి దిగనుంది. చాలా రోజుల తరువాత జట్టులోకి వచ్చిన దీపక్ చహర్ సత్తాచాటాడు. తన స్వింగ్ ప్రతాపం మరోసారి చూపి ఆదిలోనే వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా వికెట్లు పడగొట్టారు. కుల్‌దీప్ యాదవ్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ఇక 190 పరుగుల లక్ష్యాన్ని శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఊదేశారు. ఇషాక్ కిషన్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, సంజు శాంసన్ ఈ మ్యాచులో బ్యాటింగ్ చేయాలని చుస్తున్నారు.
తుది జట్లు (అంచనా):
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మొహ్మద్ సిరాజ్.
జింబాబ్వే: తాడివానాశే మరుమని, ఇన్నోసెంట్ కైయా, సీన్ విలియమ్స్, వెస్లే మాధవెరె, సికందర్ రజా, రెగిస్ చకబ్వా (కెప్టెన్), రైన్ బర్ల్, లూక్ జాన్‌గ్వే, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ నైచి, రిచర్డ్ ఎన్‌గర్వావ.
డ్రీమ్ 11 టీమ్:
శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), వెస్లే మాధవెరె, సికందర్ రజా, రెగిస్ చకబ్వా, దీపక్ చహర్(కెప్టెన్), లూక్ జాన్‌గ్వే, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
Also Read: Horoscope Today August 20th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశి వారిని నెగటివిటీ వెంటాడుతుంది...
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మళ్లీ తగ్గింది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook