Horoscope Today August 20th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశి వారిని నెగటివిటీ వెంటాడుతుంది...

ఇవాళ శనివారం. శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజు. శనివారం నాడు శనీశ్వరుడి పూజ, నియమాలు పాటించడం ద్వారా శని అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు పట్టిన శని బాధలు విముక్తమవుతాయి. ఈ శనివారం ఏయే రాశుల వారి జీవితం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2022, 06:52 AM IST
  • ఇవాళ శనివారం.. శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజు
  • శని దేవుడిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు
  • ఈ శనివారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే
Horoscope Today August 20th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశి వారిని నెగటివిటీ వెంటాడుతుంది...

Horoscope Today August 20th 2022: ఇవాళ శనివారం. శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజు. శనివారం నాడు శనీశ్వరుడి పూజ, నియమాలు పాటించడం ద్వారా శని అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు పట్టిన శని బాధలు విముక్తమవుతాయి. ఈ శనివారం ఏయే రాశుల వారి జీవితం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి (Aries)

ఇవాళ మధ్యాహ్నం వరకు ఏదీ కలిసిరాదు. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. నిరుత్సాహంగా ఉంటారు. కానీ మధ్యాహ్నం తర్వాత మీరు చాలా సంతోషంగా గడుపుతారు. మీలోని అంతర్గత శక్తి మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. చదువు, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ విషయాల్లో పట్టింపులేని తనం వీడాలి. మీరు కేర్‌లెస్‌గా ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆశించిన గౌరవం తగ్గదు. మీ జీవితభాగస్వామితోనూ ఆ సమస్య తలెత్తుతుంది.

వృషభ రాశి (Taurus)

ఇవాళ డబ్బు అతిగా ఖర్చు చేస్తారు. అది మీ సేవింగ్స్‌పై ప్రభావం చూపుతుంది. వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. టీమ్‌ను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకపక్షంగా ముందుకెళ్లడం బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. ఇతరులకు అప్పులు ఇవ్వొద్దు. ఇచ్చిన పక్షంలో తిరిగి వెనక్కి రాకపోవచ్చు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు సంబంధించిన  నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటే మంచిది.

మిథున రాశి (GEMINI)

ఇవాళ సోషల్ గెట్ టు గెదర్‌లో పాల్గొంటారు. చాలాకాలంగా కలవనివారిని మళ్లీ ఇప్పుడు కలుస్తారు. గ్లామర్, ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు ఏదైనా కొత్తగా చేయడానికిప్రయత్నిస్తారు. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ జంటలు సంతోష సమయాలను ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటక రాశి (Cancer) 

వృత్తిపరంగా ఇవాళ ఒక్క నిమిషం కూడా తీరిక ఉండకపోవచ్చు. పనిభారం కారణంగా త్వరగా అలసిపోతారు. చేపట్టిన పనిని ఆస్వాదిస్తున్నప్పటికీ మానసిక అలసట కొంత ఇబ్బంది పెడుతుంది. అనవసర వాటిపై ఎక్కువ ఖర్చు చేస్తారు. కుటుంబంలో చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల నుంచే ఇవాళ గుడ్ న్యూస్ వింటారు.

సింహ రాశి (LEO)

పెద్దల ఆశీస్సులు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. కీలక విషయాల్లో మీ అంతరంగాన్ని ఫాలో అవడం మంచి ఫలితాలనిస్తుంది. ఆర్థికపరమైన నిర్ణయాల్లోనూ మీ అంతరంగం ఏది చెబితే అది చేయండి. అది మీకు తప్పక లాభాలను తీసుకొస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులకు అన్నీ అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.

కన్య రాశి (Virgo)

ఇవాళ మధ్యాహ్నం వరకు మీరు చాలా సంతోషంగా, ఉత్సాహంగా గడుపుతారు. కానీ ఆ తర్వాత నెగటివిటీ వెంటాడుతుంది. ప్రతీ ఆలోచనలో నెగటివిటీ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. వృత్తిపరంగా ఇది ప్రభావం చూపుతుంది. ఇంట్లోనూ అనవసర వాగ్వాదాలు జరుగుతాయి. ఇవాళ డబ్బు ఎవరికీ అప్పుగా ఇవ్వొద్దు. ఇచ్చే పక్షంలో ఇక అది తిరిగి వచ్చే అవకాశం తక్కువ. 

తులా రాశి (Libra)

చంద్ర అనుగ్రహం కలుగుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. ప్రేయసి లేదా ప్రియుడు మీ నుంచి బహుమతులు ఆశిస్తారు. వృత్తిపరంగా చాలా ఓపికగా వ్యవహరిస్తారు.అది మీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది. మీ పనితీరుకు అభినందనలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే  సమయం ఆసన్నమైన్నట్లే.

వృశ్చిక రాశి (Scorpio)

అనవసర ఖర్చులను తగ్గించుకోవడంలో సక్సెస్ అవుతారు. తద్వారా మీ సేవింగ్స్ పెరుగుతాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. అవివాహితులైన బ్యాచిలర్స్‌కు పెళ్లి సంబంధాలు వస్తాయి. ట్రావెల్ రంగంలో ఉన్నవారు లేదా సప్లై చైన్ రంగంలో ఉన్నవారికి ఇవాళ విశేషంగా కలిసొస్తుంది. కడుపు సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

ధనుస్సు రాశి (Sagittarius)  

వృత్తిపరంగా మీరు అకున్నది అనుకున్నట్లుగా జరగదు. అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. మీలో కొంత అహంకారపూరిత ధోరణి కారణంగా మీతో ఇతరులు సులువుగా కలిసిపోలేరు. అది మీరు చేపట్టే పనులపై కూడా ప్రభావం చూపుతుంది. ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి కీలక నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేయండి. రిలేషన్‌షిప్‌లో సామరస్యాన్ని మెయింటైన్ చేయండి. అనవసర వాగ్వాదం ఇద్దరి మధ్య గ్యాప్‌ను పెంచుతుంది.

మకర రాశి (Capricorn) 

ఇవాళ మీరు చాలా సున్నితంగా, భావోద్వేగపూరితంగా ఉంటారు. కదిలిస్తే చాలు ఎమోషనల్ అయిపోతారు. ఫ్యామిలీ సమస్యలను బాగా డీల్ చేస్తారు. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. గతంలో ఆమెను బాధించిన సందర్భాలకు క్షమాపణ కోరుతారు. కొత్త ప్రయాణం మొదలుపెడుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది.

కుంభ రాశి (Aquarius)

ఇవాళ మీ ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ తగినంత ఉంటుంది. అవసరానికి ఇతరుల వద్ద చేయి చాచే సందర్భమేమీ రాదు. ఇవాళ మిమ్మల్ని సన్నిహితులు లేదా తెలిసిన వ్యక్తులు అప్పు కోరే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఆచీ తూచీ వ్యవహరించండి. పెద్దల ఆశీస్సులు మీకు కలిసొస్తాయి.

మీన రాశి (Pisces) 

మీలో ఎనర్జీ ఇవాళ చాలా 'హై'లో ఉంటుంది. ఏ పని చేపట్టినా ఆశావాద దృక్పథంతో ముందుకెళ్తారు. ఫ్యామిలీతో కలిసి ఔటింగ్స్ ప్లాన్ చేస్తారు. స్నేహితులతో సరదాగా సాయంత్రం ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు పరంగా బాగా రాణిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: CM KCR Convoy: సినిమా స్టైల్లో మునుగోడు సభకు కేసీఆర్.. వేల సంఖ్యలో కార్లతో భారీ కాన్వాయ్‌ ?

Also Read: 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News