ICC rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ (ICC T20 rankings)లో శ్రేయస్ అయ్యర్ 27 స్థానాలు ఎగబాకి.. 18 స్థానానికి చేరాడు. మాజీ కెప్టెన్​ విరాట్ కోహ్లీకి (Virat Kohli) టాప్​ 10లో చోటు దక్కలేదు. కోహ్లీ 5 స్థానాలు దిగజారి 15వ స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​లో శ్రేయస్ (Shreyas Iyer) అద్భుతమైన ప్రదర్శన చేయడం కారణంగానే మెరుగైన ర్యాంకును చేరుకున్నాడు. టీమిండియా ఈ సిరీస్​ను 3-0 తేడాతో గెలిచింది. అయ్యర్ 3 మ్యాచుల్లో 174 స్ట్రైక్​ రేట్​తో 204 రన్స్ చేశాడు. పేసర్ భువనేశ్వర్ మూడు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ తో సిరీస్‌లో రాణించిన శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సాంకా (Pathum Nissanka) ఆరు స్థానాలు ఎగబాకి తొమ్మిదవ స్థానానికి చేరుకున్నాడు. యుఏఈ ఆటగాడు మహ్మద్ వసీమ్​ 12వ స్థానాన్ని దక్కించుకున్నాడు.  ఆ దేశం తరఫున టీ20ల్లో అత్యుత్తమ ర్యాంక్​ను సాధించింది ఇతనే. 2017లో షైమాన్ అన్వర్ 13వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో శ్రీలంక ఆటగాడు లహిరు కుమార ఐదు వికెట్లు పడగొట్టడంతో తొలిసారిగా టాప్ 40 బౌలర్లలో చోటు దక్కించుకున్నాడు.


టెస్ట్​ ర్యాంకింగ్స్​లో..
టెస్ట్​ ర్యాకింగ్స్​లో దక్షిణాఫ్రికా బౌలర్​ కగిసో రబడ ( Kagiso Rabada) మూడో స్థానానికి చేరుకున్నాడు. జేమిసన్​ రెండు స్థానాలు దిగజారి 5 స్థానంలో, టిమ్​ సౌథీ ఒక స్థానం కోల్పోయి 6 స్థానంలోను నిలిచారు. ఈ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా కెప్టెన్​ పాట్​ కమిన్స్​ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ (Ravichandran Ashwin) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. బ్యాట్స్ మెన్స్ జాబితాలో మార్నస్​ లబుషేన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 


వన్డే ర్యాంకింగ్స్​లో..
వన్డే ర్యాకింగ్స్​లో బ్యాటర్ల లిస్ట్ లో పాకిస్థాన్​ ఆటగాడు బాబర్​ అజామ్​, బౌలర్ల జాబితాలో కివీస్ పేసర్​ ట్రెంట్​ బౌల్ట్​ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు.


Also Read: Virat Kohli 100 Test: మరో 38 పరుగులే.. దిగ్గజాల సరసన చేరనున్న విరాట్ కోహ్లీ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook