Ind vs Aus T20 Series: బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 ఆధిక్యంతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. చివరి మ్యాచ్‌లో సులభమైన టార్గెట్ ఇచ్చినా ఆసీస్ బ్యాటర్లు ఛేదించలేక చేతులెత్తేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ పదే పదే వికెట్లు కోల్పోయింది. అందరూ దూకుడుగా ఆడినా ఎవరూ 25 పరగులు దాటలేదు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే 53 పరుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆ తరువాత 161 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా ప్రారంభంలో దూకుడుగా ఆడింది. ఫిలిప్, ట్రావిస్ హెడ్ , టీమ్ డేవిడ్ అవుట్ కావడంతో పలితం ఇండియాకు అనుకూలంగా మారింది. 


ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్. చాలా ఉత్కంఠగా సాగిన మ్యాచ్ చివరి ఓవర్‌లో 10 పరుగులు మాత్రమే చేయాల్సిన పరిస్థితి. అర్షదీప్ లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌కు 15 బంతుల్లో 22 పరుగులతో ఆసీస్‌కు విజయం అందించే దిశగా వెళ్తున్న మాధ్యూ వేడ్ అవుట్ అయ్యాడు. అంతకుముందు మ్యాచ్ ఇండియా వైపు ఉండేది. 18 బంతుల్లో 32 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఆవేశ్ ఖాన్ వేసిన 18 ఓవర్ ఆస్ట్రేలియాకు అనుకూలంగా మార్చేసింది. మూడు వరుస బౌండరీలతో ఆ ఓవర్‌లో 15 పరుగులు వచ్చా.యి.


ఆ తరువాత 19, 20 ఓవర్లతో ముకేష్, అర్షదీప్ తమ చేతుల్లోకి తెచ్చేశారు. చివరి ఓవర్‌లో మూడు పరుగులే ఇవ్వడంతో పాటు ఒక వికెట్ తీసిన అర్షదీప్ టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. అంతే 5 టీ20 ల సిరీస్‌ను 4-1తో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. 


Also read: T20 World Cup 2024: తొలిసారిగా ఐసీసీ టోర్నీ ఆడనున్న ఉగాండా, టీ20 ప్రపంచకప్ టోర్నీకు 20 జట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook