గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21వ కామన్వెల్త్‌ క్రీడల ఆఖరిరోజు భారత్‌ పతకాల పంట పండింది. పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో భారత్‌కు రజత పతకం లభించింది. పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో రంకిరెడ్డి సాత్విక్‌-షెట్టి చిరాగ్‌ జోడి రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్‌లో ఎల్లిస్‌-లాస్‌ గ్రిడ్జ్‌ (ఇంగ్లండ్‌) జోడీపై 13-21, 16-21 తేడాతో రంకిరెడ్డి సాత్విక్‌-షెట్టి చిరాగ్‌ జోడి ఓటమి పాలైంది. టేబుల్‌ టెన్నిస్‌లో శరత్‌ కమల్‌, ఇంగ్లండ్‌ ఆటగాడిని వరుస సెట్లలో మట్టికరిపించి భారత్‌కు కాంస్య పతకం అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళల బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌ స్వర్ణ పతకం సాధించగా, పీవీ సింధు రజతం సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో శ్రీకాంత్‌ రజత పతకం సాధించారు. మహిళల స్క్వాష్  డబుల్స్‌ ఫైనల్‌లో భారత్‌ స్టార్లు జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్‌ కార్తీక్‌లు రజత పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటింది. మొత్తం 66 పతకాలతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 26 స్వర్ణ పతకాలు, 20  రజత పతకాలు, 20 కాంస్య పతకాలతో మొత్తం 66 పతకాలు  సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఆతిథ్య ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది.


కాగా, గతంలో గ్లాస్గో గేమ్స్‌లో భారత్ 64 పతకాలు సాధించింది. ఈసారి గోల్డ్ కోస్ట్‌లో జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 66 పతకాలు వచ్చాయి. కాగా, కామన్వెల్త్ క్రీడలలో భారతదేశం ఇప్పటివరకు 500 పతకాలను కైవసం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటివరకు మొత్తం 503 పతకాలు సాధించింది. గతంలో వచ్చిన పతకాల సంఖ్యను కూడా కలుపుకుంటే.. మొత్తం ఆ సంఖ్య 505 అవుతుంది.


స్వాతంత్ర్యం తరువాత, భారతదేశం 1954లో కామన్వెల్త్ క్రీడలలో పాల్గొంది. గతంలో 1934 మరియు 1938లో భారతదేశం ఈ క్రీడల్లో పాల్గొంది. 1934లో రెండు పతకాలు లభించాయి. స్వాతంత్ర్యం తరువాత, 1954లో ఇండియాకు ఏ పతకమూ రాలేదు. 1958లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 2 బంగారు పతకాలతో పాటు మొత్తం 3 పతకాలు సాధించింది భారత్. 1990లో ఆక్లాండ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొట్టమొదటిసారిగా పది కంటే ఎక్కువ సంఖ్యలో బంగారు పతకాలను సాధించింది.  ఈ గేమ్స్‌లో 13 బంగారు పతకాలతో 32 పతకాలు సాధించింది.


మాంచెస్టర్ లో గొప్ప ప్రదర్శన


2002 మాంచెస్టర్ క్రీడలలో భారతదేశం అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ఆ క్రీడల్లో , ఆటగాళ్ళు మొత్తం 30 బంగారు పతకాలతో మొత్తం 69 బంగారు పతకాలు సాధించారు. ఆ తరువాత, 2010లో, ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా భారతీయ ఆటగాళ్ళు అద్భుతమైన ఆటతీరుతో పతకాలు సాధించి సెంచరీ దిశగా పయనించారు. ఢిల్లీలో భారత్ 38 స్వర్ణ పతకాలు సాధించింది.


భారతదేశం స్వాతంత్ర్యం తరువాత 15 కామన్వెల్త్ క్రీడలలో పాల్గొంది.  ఈ క్రీడల్లో భారత్ మొత్తంగా 503 పతకాలను సాధించింది. కామన్వెల్త్ క్రీడల చివరి రోజున, భారతదేశం 500 పతకాల మైలురాయిని అధిగమించడానికి 5 పతకాలు అవసరమయ్యాయి. ఆదివారం జరిగిన క్రీడల్లో భారతీయ క్రీడాకారులందరూ మొత్తం 7పతకాలను సాధించి మైలురాయిని అధిగమించారు.


కామన్వెల్త్ క్రీడల్లో 4 అత్యుత్తమ ప్రదర్శనలు:


సంవత్సరం స్థలం  స్వర్ణం  రజతం  కాంస్యం మొత్తం
2018 గోల్డ్ కోస్ట్ 26 20 20 66
2014 గ్లాస్గో 15 30 19 64
2010 ఢిల్లీ 38 27 36 101
2002  మాంచెస్టర్ 30 22 17 69