దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ `నాగిని` డ్యాన్స్..వీడియో వైరల్
టీమిండియా మజీ క్రికెట్ ఆటగాడు, దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ 'నాగిని' డ్యాన్స్ వేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. అసలు నాగిని డ్యాన్స్ వెనుక కథేంటి? అనే వివరాల్లోకి వెళితే..
టీ-20 సిరీస్‌లో శ్రీలంకపై గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలో హంగామా చేశారు. నాగిని డ్యాన్స్ కూడా చేశారు! అదే సిరీస్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై టీమిండియా గెలిచిన తర్వాత చాలామంది బంగ్లా టీమ్‌ని హేళన చేస్తూ స్టేడియంలో అభిమానులు నాగిని డ్యాన్స్ చేశారు. అందులో టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇది.
<
>
టీమిండియా బ్యాటింగ్ కొనసాగుతున్న సమయంలోనే కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ 'నాగిని' డ్యాన్స్ వేశారు. పక్కనే ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ కోరిక మేరకు గవాస్కర్ ఇలా స్టెప్పులేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. ఐతే, తమ టీమ్‌ని హేళన చేస్తూ గవాస్కర్ ఇలా డ్యాన్స్ చేశారంటూ బంగ్లా అభిమానులు ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.