Smriti Mandhana: ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా `స్మృతి మంధాన`
Smriti Mandhana : భారత ఓపెనింగ్ ప్లేయర్ స్మృతి మందానకు ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డు దక్కింది. పూర్తి వివరాలు మీ కోసం.
ICC Women's Cricketer of 2021- Smrithi Mandhana: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో ఘనతను సొంతం చేసుకుంది. ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2021 (ICC Women's Cricketer Of 2021) పురస్కారాన్ని గెలుచుకుంది. 2021లో అన్ని ఫార్మాట్లలో కలిపి 22 అంతర్జాతీయ మ్యాచుల్లో 38.86 సగటుతో 855 పరుగులు చేసింది స్మృతి (Smrithi Mandhana). అందులో ఒక సెంచరీ సహా ఐదు అర్ధ శతకాలున్నాయి.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో (South Africa) పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా భారత్ కేవలం రెండే మ్యాచ్‌లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు విజయాల్లోనూ ఓపెనర్ స్మృతి కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచిన ఆమె... చివరి టీ20 మ్యాచ్‌లో 48 పరుగులతో సత్తా చాటింది.
Also Read: England Women Cricket: ఆటే కాదు..అందంతో కూడా ఆకట్టుకుంటున్న ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఛార్లీ డీన్
ఇంగ్లండ్‌తో టెస్టు (England Test Match) మ్యాచ్‌లో 78 పరుగులు సాధించిన ఆమె... మ్యాచ్ డ్రా కావడంలో తన వంతు పాత్ర పోషించింది. అంతేగాక భారత్ గెలిచిన ఏకైక వన్డే సిరీస్‌లో 49 పరుగులతో రాణించింది. ఇక టీ20 సిరీస్‌లో భాగంగా 15 బంతుల్లో కీలకమైన 29 పరుగులతో పాటు అర్ధ సెంచరీ సాధించి సత్తా చాటింది. అంతేగాక ఆస్ట్రేలియాతో (Australia) సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో స్మృతి మంధాన 86 పరుగులు చేసింది. ఇక కంగారూలతో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి