ICC Emerging Women's Cricketer of the Year for 2022: భారత యువ పేసర్ రేణుకా సింగ్ (India pacer Renuka Singh )కు 2022కు గాను ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్‌కు చెందిన అలిస్ క్యాప్సే మరియు స్వదేశానికి చెందిన యాస్టికా భాటియాలను వెనక్కి నెట్టి ఐసీసీ వర్ధమాన మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 గ్రహీతగా నిలిచింది. ఈ విషయాన్ని ఐసీసీ  ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఏడాది కాలంగా వన్డేలతోపాటు టీ20ల్లోనూ నిలకడగా రాణిస్తుంది రేణుకా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది జట్టులోకి వచ్చిన ఈ హిమాచల్ అమ్మాయి.. ఇప్పటి వరకు 29 మ్యాచుల్లో 40 వికెట్లు తీసింది.  వన్డేల్లో కేవలం 14.88 సగటుతో 18 వికెట్లు, టీ20ల్లో 23.95 సగటుతో 22 వికెట్లు పడగొట్టింది. రేణుక ఈ ఏడాదిలో ఆడిన ఏడు టీ20 మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు తీసింది. కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆసియా కప్‌లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేసింది. కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) భాగంగా.. ఆసీసీతో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించింది. ఇన్ స్వింగర్లు వేయడంలో ఈమె దిట్ట. 


Also Read: ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ లో సిరాజ్ జోరు.. నంబర్ వన్ గా హైదరాబాదీ పేసర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.