భారత్ పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం అడ్డంకిగా మారింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోహ్లీసేన... పాక్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించింది. 46 ఓవర్లు వచ్చే సరికి  300 మార్క్ దాటేసిన టీమిండియాకు చివరి మూడు ఓవర్లు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని భావించింది. అయితే  సరిగ్గా 46.4 ఓవర్ దశలో దశలో చిరు జల్లులు మొదలయ్యాయి. అవి పెరుగుతుండటంతో వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.


అప్పటికే కోహ్లీసేన నాలుగు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ 144 , కేఎల్ రాహుల్ 57 పరుగులతో చక్కటి భాగస్వామ్యాన్ని అందిచగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 62 బంతుల్లో ఆరు ఫోర్లతో 71 పరుగులు, విజయ్ శంకర్ 6 బంతుల్లో 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందువచ్చిన హార్థిక్ పాండ్య 26 పరుగులు చేయగా ధోనీ 1 పరుగు వద్ద ఔట్ అయ్యాడు.