India Vs Pakistan: భారత్- పాక్ మ్యాచ్‌కు అదిరిపోయే `వ్యూస్`.. టీ20 చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు..
India Vs Pakistan: దాయాదుల పోరు అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ను వీక్షించేందుకు ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. తాజాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా.. భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వీక్షణలు పరంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
India Vs Pakistan : టీ20 ప్రపంచకప్-2021(T20 World Cup 2021)లో భాగంగా.. భారత్-పాక్(IND vs PAK T20) జట్ల మధ్య దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న జరిగిన మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్(IND vs PAK T20 viewers) వ్యూస్ పరంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 167 మిలియన్ల (16.70 కోట్లు) మంది వీక్షించారు. దీంతో ఈ మ్యాచ్ పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధికంగా మంది వీక్షించిన అంతర్జాతీయ మ్యాచ్‌గా రికార్డు పుటల్లోకెక్కింది. ఈ విషయాన్ని టీ20 ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త 'స్టార్ ఇండియా'(Star india) ప్రకటించింది.
అంతకుముందు, టీ20 ప్రపంచకప్-2016లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అత్యధిక మంది వీక్షించిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను 136 మిలియన్ల మంది వీక్షించారు. ప్రపంచకప్-2021లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను(క్వాలిఫయర్లు, సూపర్-12 దశ మ్యాచ్‌లు) మొత్తం 238 మిలియన్ల మంది వీక్షించారని స్టార్ ఇండియా పేర్కొంది. క్రికెట్ వ్యూవర్షిప్ను పెంచేందుకు మరింత కృషి చేస్తున్నట్లు స్టార్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.
Also Read: Ravishastri: టీమ్ ఇండియా కోచ్‌గా వైదొలగిన రవిశాస్త్రి, ఐసీసీపై ఆగ్రహం
దాయాదుల పోరులో టీమిండియా(Teamindia)పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. నంతరం వరుస విజయాలతో దూసుకెళ్లి సెమీస్‌కు చేరింది. అఫ్గాన్‌పై విజయం సాధించి న్యూజిలాండ్ కూడా సెమీస్‌కు చేరింది. పాకిస్థాన్(Pakistan), న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమిపాలై సెమీస్ దశకు కూడా చేరకుండానే నిష్క్రమించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook