India Vs Australia తొలి టెస్టు : కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోహ్లీసేన
ఆడిలైడ్ వేదికగా గవాస్కర్ - బోర్డర్ ట్రోఫీ టెస్టు సీరిస్ ప్రారంభమైంది. ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీలల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీసేన స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 52 ఓవర్లు పూర్తయే సరికి 132 పరుగులకు 6 వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు లోకేష్ రాహుల్ 2 , మురళీ విజయ్ 11 పరుగులకే వెనుదిరిగారు. టాప్ ఆర్డర్ లో వచ్చిన కెప్టెన్ కోహ్లీ 3 , అజింక్యా రెహానే 11 పరుగులకే చేతులెత్తేశారు.
రోహిత్ శర్మ 37 , రిషబ్ పంత్ 25 పరుగులు చేసి ఇన్నింగ్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇరువురు బ్యాట్స్ మెన్స్ చతికీలపడ్డారు. ఈ క్రమంలో క్రీజులో నిలదొక్కుకొని ఉన్న చటేశ్వరపూజారా (37) రవిచంద్రన్ అశ్విన్ (2) తో కలిసి భారత్ ను గట్టేక్కించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే మ్యాచ్ ఆరంభం నుంచే ఆసీస్ బౌలర్లు భారత బ్యాట్స్ మెన్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. హాజిల్ వుడ్, లియన్ లు చెరో 2 వికెట్లు తీయగా స్ట్రాస్, కమ్మిన్స్ చెరో ఒక వికెట్ తీసి భారత్ ను దెబ్బతీశారు.