India vs Australia 3rd ODI Playing 11 Out: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మూడో మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. స్పిన్నర్‌ ఆస్టన్ అగర్‌కు కూడా తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరిగిన రెండు వన్డేల్లో చెరొక విజయం సాధించాయి. దాంతో మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమం అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. కీలక మ్యాచ్ కాబట్టి ఇరు జట్లు గట్టిగా పోరాడతాయి. అయితే చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్న నేపథ్యంలో మ్యాచ్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. చివరగా ఇక్కడ 2019 డిసెంబర్‌ 15న వన్డే జరిగింది. 


సొంత గడ్డపై గత 26 ఏళ్లుగా భారత్‌కు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఓటమనేది లేదు. దీంతో ఈ రోజు జరగబోయే మూడో వన్డేపై అందరి చూపు పడింది. భారత్‌ సిరీస్‌ గెలిచి రికార్డు నిలబెట్టుకుంటుందా లేదా ఆసీస్‌ గెలిచి టీమిండియా జైత్రయాత్రకు అడ్డుపడుతుందా అనేది చూడాలి. ఇక వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్ పై జట్టు మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. ఈ మ్యాచులో నిరూపించుకుంటేనే.. వన్డే కెరీర్ బాగుంటుంది. 



తుది జట్లు:
భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. 
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), మార్కస్ స్టోయినిస్, ఆస్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. 


Also Read: Virat Kohli: విరాట్‌ కోహ్లీకి ఊహించని ఎదురుదెబ్బ.. ఈ పతనం తాత్కాలికమేనా?  


Also Read: Virat Kohli Dating: అనుష్క శర్మను చూసి వెన్నులో వణుకుపుట్టింది.. ఆసక్తికర విషయం చెప్పిన విరాట్‌ కోహ్లీ!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.