Virat Kohli Dating: అనుష్క శర్మను చూసి వెన్నులో వణుకుపుట్టింది.. ఆసక్తికర విషయం చెప్పిన విరాట్‌ కోహ్లీ!

Virat Kohli reveals super story of Anushka Sharma before dating. 5-6 ఏళ్లు లవ్‌లో ఉన్న అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లీ .. 2017 డిసెంబరులో ఇటలీలో జరిగిన వివాహ బంధంతో ఒక్కటయ్యారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 22, 2023, 12:08 AM IST
  • అనుష్కను చూసి వెన్నులో వణుకుపుట్టింది
  • ఆసక్తికర విషయం చెప్పిన కోహ్లీ
  • వివాహ బంధంతో ఒక్కటయ్యారు
Virat Kohli Dating: అనుష్క శర్మను చూసి వెన్నులో వణుకుపుట్టింది.. ఆసక్తికర విషయం చెప్పిన విరాట్‌ కోహ్లీ!

Virat Kohli reveals story of Anushka Sharma before dating: టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో మొదటిసారి కలుసుకుని స్నేహితులు అయ్యారు. కొన్నాళ్లకు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. 5-6 ఏళ్లు లవ్‌లో ఉన్న అనుష్క, కోహ్లీ .. 2017 డిసెంబరులో ఇటలీలో జరిగిన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2021 జనవరి 11న ఈ జంటకు వామికా అనే కూతురు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరు వాళ్లవాళ్ల కెరీర్‌తో బిజీబిజీగా ఉన్నారు. 

తాజాగా 'Three Sixty' యూట్యూబ్‌ ఛానెల్‌లో ‘చాట్‌ షో విత్‌ ఏబీ డివిలియర్స్’ కార్యక్రమంలో విరాట్‌ కోహ్లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన భార్య అనుష్క శర్మతో తొలిసారి ఎలా పరిచయమైందో?, డేటింగ్‌కు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో? లాంటి విషయాలను పంచుకున్నాడు. ' 2013లో జింబాబ్వే పర్యటనకు నేను కెప్టెన్‌ అని యాజమాన్యం ప్రకటించింది. అప్పుడు ఎంతో ఉద్వేగానికి గురయ్యా. ఆ సమయంలోనే మా మేనేజర్‌ వచ్చి టీవీ కమర్షియల్‌ యాడ్‌ ఉందని చెప్పారు. అది కూడా అనుష్క శర్మతో అని చెప్పేసరికి నా గుండెల్లో రాయి పడినట్లయింది' అని కోహ్లీ చెప్పాడు. 

'అనుష్క శర్మ అప్పటికే ఎంతో పేరు తెచ్చుకున్న యాక్టర్‌ కావడంతో నాలో వణుకుపుట్టింది. ఆమెకు హాయ్‌ ఎలా చెప్పాలో, ఎలా మాట కలపాలో, యాడ్‌లో ఎలా నటించాలో అర్థం కాలేదు. లోకేషన్‌కి వెళ్లేసరికి అనుష్క చాలా ఎత్తుగా కనిపించింది. కిందకి చూస్తే హై హీల్స్‌ వేసుకొని ఉంది. దీనికంటే ఇంకా ఎత్తు చెప్పులు మీకు దొరకలేదా? అని అనగానే అదోలా చూసింది. ఆ తర్వాత యాడ్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. రోజంతా షూటింగ్‌ నడిచింది. ఆమె కూడా చాలా సాధారణమైన అమ్మాయని అప్పుడు నాకు అర్థమైంది. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది' విరాట్‌ కోహ్లీ తెలిపాడు. 

'కుటుంబ విషయాలే ఎవరినైనా దగ్గర చేస్తాయి. మమ్మల్ని కూడా అవే దగ్గర చేశాయి. ఇద్దరి కుటుంబాలు సామాన్య మధ్య తరగతివే కావడంతో తొందరగా కనెక్ట్‌ అయిపోయాం.  పరిచయం అయిన వెంటనే మేము డేటింగ్‌లో లేము. చాలా రోజులు మాట్లాడుకున్నాం. అయితే తొలి రోజు నుంచే ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లు నాకు అనిపించింది. ఆమె నా సొంతం అనుకున్నాను. ఓ రోజు మాటల మధ్యలో నీతో డేటింగ్‌లో ఉన్నట్లే అనిపిస్తోందని మెసేజ్‌ పెట్టా. ఆ మ్యాటర్‌ అక్కడితో వదిలేసి వేరే మాట్లాడుకున్నాం. తర్వాత ఒక రోజు నా గురించి ఏమనుకుంటున్నావ్‌ అని అనుష్క అడిగింది. మనిద్దరం డేటింగ్‌లో ఉన్నట్లుందని చెప్పా. క్రమంగా నా మనసును అర్థం చేసుకుంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

Also Read: Yashika Aannand Pics: హాట్ ట్రీట్ ఇచ్చిన యాషిక ఆనంద్‌.. తమిళ బ్యూటీ భారీ అందాలు చూడతరమా?  

Also Read: Anasuya Bharadwaj Pics: స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో మస్త్ ఉన్న అనసూయ భరద్వాజ్.. చూపుల్తోనే చంపేస్తోన్న హాట్ యాంకర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x