Ravindra Jadeja ఫీల్డింగ్ మాయాజాలం.. స్టీవ్ స్మిత్ షాక్.. వీడియో వైరల్
India vs Australia 3rd Test: Ravindra Jadeja: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఒకడు. అత్యుత్తమ ఫీల్డర్ అంటే గుర్తుకొచ్చే పేర్లలో జడేజా కచ్చితంగా ఉంటాడు. సరిగ్గా నేడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి రవీంద్ర జేడేజా అద్భుతం చేశాడు.
India vs Australia 3rd Test: Ravindra Jadeja: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఒకడు. అత్యుత్తమ ఫీల్డర్ అంటే గుర్తుకొచ్చే పేర్లలో జడేజా కచ్చితంగా ఉంటాడు. సరిగ్గా నేడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి రవీంద్ర జేడేజా అద్భుతం చేశాడు. మూడో టెస్టు రెండో రోజు ఆటలో జడేజా స్టన్నింగ్ త్రో విసరడంతో ఆతిథ్య ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(131; 226 బంతుల్లో 16 ఫోర్లు) శతకం సాధించి భారీ దిశగా దూసుకెళ్తున్నాడు. మరోవైపు అవతలి ఎండ్ వికెట్లు పడుతున్నా స్టీవ్ మాత్రం ధీమాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అనవసరంగా రెండో పరుగు కోసం యత్నించిన స్టీవ్ స్మిత్‌తో పాటు ఆసీస్ జట్టుకు షాకిచ్చాడు జడేజా. మెరుపు వేగంతో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) బంతిని వికెట్లకు డైరెక్ట్ త్రో విసరడంతో స్టీవ్ స్మిత్ రనౌట్ అయ్యాడు.
Also Read: Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మాస్క్.. 10 ఆసక్తికర విషయాలు
సెకండ్ డౌన్(నాలుగో స్థానం)లో బ్యాటింగ్‌కు దిగిన స్టీవ్ స్మిత కొరకరాని కొయ్యగా మారి శతకం సాధించాడు. ఈ క్రమంలో జడేజా అద్భుతమైన ఫీల్డింగ్‌కు వికెట్ సమర్పించుకున్నాడు స్టీవ్ స్మిత్. అదే చివరి వికెట్ కావడంతో 105.4 ఓవర్లకు 338 పరుగులు చేసి ఆసీస్ ఆలౌట్ అయింది. అయితే టీమిండియా(Team India) ఆటగాడు జడేజా తన ఫీల్డింగ్‌తో ఏమైనా చేయగలడు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read: India vs Australia 3rd Test Day 1 Highlights: సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆతిథ్య ఆస్ట్రేలియాదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook