India Vs Australia: అహ్మదాబాద్ టెస్టులో భారత్ జోరు.. ఆసీస్‌కు దీటుగా..
India Vs Australia 4th Test Day 3 Highlights: చివరిలో టెస్టులో ప్రత్యర్థి ఆసీస్‌కు దీటుగా జవాబిస్తోంది భారత్. నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 289 రన్స్ చేసింది. గిల్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ 59 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
India Vs Australia 4th Test Day 3 Highlights: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే భారత్ 191 పరుగులు వెనుకబడి ఉంది. విరాట్ కోహ్లీ 59, రవీంద్ర జడేజా 16 నాటౌట్‌గా ఉన్నారు. నాథన్ లియోన్, మాథ్యూ కున్హెమాన్, టాట్ మర్ఫీలు చెరో వికెట్ తీశారు.
అంతకుముందు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ 235 బంతుల్లో 128 పరుగులతో టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఛెతేశ్వర్ పుజారా 42 పరుగులు చేశాడు. తొలి వికెట్‌కు రోహిత్ శర్మతో 74 పరుగులు జోడించిన గిల్.. పుజారా రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నాలుగో వికెట్‌కు అజేయంగా 44 పరుగులు జోడించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అత్యధికంగా 180 పరుగులు చేయగా.. ఆల్ రౌండర్ కెమెరూన్ గ్రీన్ 114 పరుగులతో కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరఫున రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ 2 వికెట్లు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.
నాలుగో రోజు ఆటలో టీమిండియా సాధ్యమైంత వేగంగా పరుగులు చేస్తే ఫలితం ఆశించవచ్చు. బంతి పాతపడిపోవడంతో స్ట్రోక్స్ ఆడడం కష్టంగా మారింది. అయినా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడం ఊరట కలిగించే అంశం. విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఓ ఎండ్‌లో పాతుకుపోతే.. అవతలి ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు చేయాలి. ఆసీస్ కంటే ఎక్కువ పరుగులు చేసి.. రెండో ఇన్సింగ్స్‌లో ఆ జట్టును త్వరగా ఆలౌట్ చేయాలనేది టీమిండియా గేమ్ ప్లాన్.
Also Read: MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఏంటి..? అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
Also Read: Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీ.. కేఎల్ రాహుల్ సర్దుకోవాల్సిందేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook