India Vs Australia: మూడో టెస్ట్‌కు పాట్ కమిన్స్ డౌట్.. ఆసీస్ కెప్టెన్ ఎవరంటే..?
Ind Vs Aus 3rd Test Match Updates: టీమిండియాతో మూడో టెస్టుకు ముందు ఆసీస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. డేవిడ్ వార్నర్ గాయం నుంచి టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కుటుంబ కారణాల రీత్యా స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ పాట్ కమిన్స్.. తిరిగి జట్టుతో ఎప్పుడు చేరతాడో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే మిగిలిన మ్యాచ్‌లకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
Ind Vs Aus 3rd Test Match Updates: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో రెండు టెస్టులు ఓడిపోయిన ఆస్ట్రేలియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సిరీస్‌కు ముందే నుంచి కీలక ఆటగాళ్ల గాయాలపాలవ్వడం ఇబ్బంది పెట్టింది. కెమెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్ వంటి స్టార్ ప్లేయర్లు దూరమవ్వడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. చివరి రెండు టెస్టులకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. అదేవిధంగా కుటుంబ కారణాల రీత్యా ఆసీస్‌కు వెళ్లిపోయిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. తిరిగి జట్టుతో చేరేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కమిన్స్ కూడా దూరమైతే ఆసీస్ మరింత బలహీనంగా మారే అవకాశం ఉంది. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. చివరి రెండు మ్యాచ్‌లకు గ్రీన్, స్టార్క్ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది.
కంగారూ కెప్టెన్ పాట్ కమిన్స్ తన ఇంట్లో ఒకరికి అనారోగ్యం కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. జట్టులో ఎప్పుడు చేరతాడనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. వన్డే సిరీస్ ఆడటం కూడా సందేహాస్పదంగా కనిపిస్తోంది. దీంతో మిగిలిన రెండు టెస్టులకు స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చు. బాల్ టాంపరింగ్ కుంభకోణం తర్వాత స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ నుంచి రెండేళ్లపాటు నిషేధానికి గురయ్యాడు. నిషేధం తరువాత 2021లో అడిలైడ్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మళ్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. మళ్లీ గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌పై స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పటివరకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా 36 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 10 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.
ఓపెనర్ డేవిడ్ వార్నర్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమవ్వగా.. చికిత్స కోసం స్వదేశానికి పయనమయ్యాడు. వార్నర్ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఉస్మాన్ ఖవాజాకు తోడు ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది.
టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని అందరూ అనుకున్నారు. అయితే టీమిండియా బౌలర్ల ధాటికి రెండు టెస్టుల్లోనూ ఆసీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా మాయజాలానికి.. అశ్విన్ ఆఫ్ బ్రేక్స్‌కు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. షమీ, సిరాజ్ తమ పేస్‌తోనూ ఆకట్టుకున్నారు. దీంతో రెండు టెస్టుల్లోనూ భారత్ గెలుపు సులువైంది. మార్చి 1 నుంచి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.
Also Read: Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook