New Rules in Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్

Face Recognition Technology In Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఇక నుంచి టీడీపీ తిరుమల కొండపై కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీని టీటీడీ అమలు చేయనుంది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమేకాకుండా.. మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 12:21 PM IST
New Rules in Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్

Face Recognition Technology In Tirumala: తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్ అమలు కానుంది. భక్తుల కోసం ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపులు తదితర అంశాల్లో మరింత పాదర్శకతం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఒక వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు తీసుకోకుండా నివారించేందుకు.. వసతి గదుల కేటాయింపు కేంద్రాల వద్ద.. కాషన్‌ డిపాజిట్‌ కౌంటర్ల దగ్గర ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజనీ ఉపయోగిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని.. ఆ తరువాత పూర్తిస్థాయిలో ఉపయోగిస్తామన్నారు. దళారీ వ్యవస్థకు కూడా చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

ఇక తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా ఉంది. ఒక కంపార్టుమెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,374 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,691 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు . సోమవారం స్వామి వారి హుండీకి రూ.4.2 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

జ్ఞాన ప్రసూనాంబ, శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ తరపున ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఏవీ ధర్మారెడ్డి దంపతులకు స్వాగతం పలికారు. ధర్మారెడ్డికి ఆలయ అర్చకులు తలపాగా చుట్టి.. తల మీద పట్టు వస్త్రాలు ఉంచారు. పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం.. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం చివరి రోజు కాగా.. ఉదయం త్రిశూలస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా రాగా.. భక్తులు కర్పూర హారతులు సమర్పించి పూజలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 7 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి  

Also Read: IAS vs IPS: కర్ణాటకలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్.. వ్యక్తిగత ఫొటో షేర్ చేస్తూ తీవ్ర ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News