India vs Australia: Cheteshwar Pujara Goes Past 6000 Run Mark: భారత టపార్డర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో 6000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ టెస్టులో వన్‌డౌన్ ఆటగాడు పుజారా ఈ ఫీట్ నమోదు చేశాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో సింగిల్ తీయడంతో పుజారా తన టెస్టు కెరీర్‌లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 11వ భారత ఆటగాడుగా పుజారా నిలిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మూడో టెస్టులో కీలక ఇన్నింగ్స్ సైతం ఆడాడు టీమిండియా(Team India) ఆటగాడు పుజారా. అర్ధశతకం చేసుకున్న పుజారా(77: 205 బంతుల్లో 12 ఫోర్లు) హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్(97: 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకున్నాడు. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారి లయను దెబ్బతీశాడు పంత్.


Also Read: Ravichandran Ashwin: టీమిండియాకు క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా



 


 



 


సెంచరీకి చేరువవుతున్న క్రమంలో పాట్ కమిన్స్ బౌలింగ్‌లో నాథన్ లయన్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ ఔటయ్యాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అజింక్య రహానే మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించారు. శుభ్‌మన్‌గిల్ పరవాలేదనిపించాడు. హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) సైతం హీరోచిత ప్రదర్శన చేశారు. భారత జట్టును ఓటమి గండం నుంచి గట్టెక్కించారు.


Also Read: Steve Smith: టెస్టుల్లో తొలి క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook