India vs Australia Test Series Updates: ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరిచిపోలేకపోతున్నాడు. ఆసీస్ పర్యటనలో జరిగిన అవమానాలపై ప్రతీకారానికి బదులుగా సెటైర్లు గుప్పిస్తున్నాడు. టీమిండియా(Team India) విజయానికి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ టీమ్ పైన్ కారణమంటూ అశ్విన్ సెటైర్లు వేశాడు. రిషబ్ పంత్‌ను స్టంపింగ్ చేసే అవకాశాన్ని వదిలేసి తమను గెలిపించాడని కామెంట్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ముఖ్యంగా మూడో టెస్టు సిడ్నీలో జరిగిన వివాదం ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. మూడో టెస్టు డ్రాగా ముగియడం తెలిసిందే. అయితే ఆ టెస్టులో అశ్విన్ వర్సెస్ టీమ్ పైన్‌గా మాటల యుద్ధం జరిగింది. గబ్బాలో మీ పని పడతాం, అక్కడ చూసుకుందామని టీమ్ పైన్ సవాల్ విసరగా, భారత పర్యటనకు వస్తే అదే నీకు చివరి సిరీస్ అవుతుందని అశ్విన్(Ravichandran Ashwin) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 


Also Read: Budget 2021: మీకు ఆదాయం లేకపోయినా సరే ఈ పన్నును చెల్లించక తప్పదు



ఇందుకు సంబంధించిన వీడియో సైతం వైరల్‌గా మారింది. అనంతరం ఆతిథ్య ఆసీస్ జట్టు కెప్టెన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో టీమిండియా(Team India) ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌తో స్పిన్నర్ అశ్విన్ ముచ్చటించాడు. టీమ్ పైన్ పిలిచినట్లుగానే మేం నాలుగో టెస్టు వేదిక గబ్బాకు వెళ్లామన్నాడు. 


Also Read: IPL 2021: అత్యధికంగా ఆర్జించిన భారత క్రికెటర్లు వీరే..



అయితే అక్కడ తమను గెలిపించిన రిషబ్ పంత్(89 నాటౌట్)ను స్టంపౌట్ చేసే అవకాశాన్ని కెప్టెన్, కీపర్ టీమ్ పైన్(Tim Paine) మిస్ చేసి టీమిండియా మేలు చేశాడని ఛలోక్తులు విసిరాడు. పంత్‌ను స్టంపింగ్ చేయకుండా ఆసీస్ కెప్టెన్ తమను గెలించాడని అశ్విన్ పేర్కొన్నాడు. అతడు తప్పిదం చేయకుండా తమకు విజయం చేకూరేది కాదని అభిప్రాయపడ్డాడు.


Also Read: IPL 2021 Sunrisers Hyderabad: వచ్చే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు వీరే..


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook