David Warner Ruled Out From Border Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియాకు మరో ఎదురుబెబ్బ తగిలింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమయ్యాడు. ఢిల్లీలో జరిగిన టెస్టులో వార్నర్ గాయపడిన విషయం తెలిసిందే. వార్నర్ గాయం తీవ్రంగా ఉండడంతో చికిత్స నిమిత్తం స్వదేశానికి పయనమయ్యాడు. వార్నర్ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. మార్చి 1 నుంచి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెస్టు సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల నుంచి డేవిడ్ వార్నర్‌ తప్పుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. 'ఢిల్లీ టెస్టులో వార్నర్ మోచేయికి గాయమైంది. సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు వార్నర్ అందుబాటులో ఉండడు..' అని ఓ ప్రకటన విడుదల చేసింది. వార్నర్ దూరమైన నేపథ్యంలో ఖవాజాతో కలిసి ఓపెనింగ్‌ను ఎవరు చేస్తారనేది క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా ప్రకటించలేదు. అయితే ఖవాజాకు జోడీగా ట్రావిస్ హెడ్ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ బ్యాటింగ్‌కు అందుబాటులో లేకపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ హెడ్‌ను ఓపెనర్‌గా పంపింది. మిగిలిన రెండు టెస్టులకు అతనే ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. వన్డే సిరీస్‌కు డేవిడ్ వార్నర్ తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.  


సిరీస్‌లో 0-2తో ఆసీస్‌కు మిగిలిన రెండు టెస్టులు కీలకంగా మారాయి. మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టులో కీలకు మార్పులు చూడవచ్చు. తొలి రెండు టెస్టుల్లో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ కెమెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండునున్నారు. గ్రీన్ రాకతో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌లో సమతూకం రానుంది. 6వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడంతోపాటు.. బౌలింగ్‌లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఎలాంటి పిచ్‌లపై అయినా చెలరేగే మిచెల్ స్టార్క్.. టీమిండియా బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టగలడని ఆసీస్ ఫ్యాన్స్ అంటున్నారు.


మరోవైపు రెండు టెస్టుల్లో గెలిచి ఊపుమీదుంది భారత్. చివరి రెండు టెస్టులకు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించగా.. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే వైస్ కెప్టెన్ పదవి నుంచి కేఎల్ రాహుల్‌ను తొలగించింది. రాహుల్ చెత్త బ్యాటింగ్‌తో అన్ని వైపులా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తరువాత జరిగే మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వాలని అన్ని వైపులా నుంచి డిమాండ్ వస్తోంది. 


Also Read: Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే.. ఆ ప్లేయర్ ఎంట్రీతో మరింత పవర్‌ఫుల్   


Also Read: PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్యగమనిక.. మీ ఖాతాలో నగదు ఎప్పుడు జమకానుందంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook