Shikhar Dhawan: వన్డేల్లో వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీల ఈ రికార్డు సమం చేసిన శిఖర్ ధావన్
India vs England Shikhar Dhawan | మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టుపై 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టుపై 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఆపై లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.
టీ20 సిరీస్‌లో జట్టులో చోటు దక్కవపోవడంతో మానసికంగా సిద్ధమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (98) భారీ అర్ధశతకాన్ని సాధించాడు. అదే సమయంలో వికెట్ కోల్పోవడంతో ఒత్తిడికి లోనైన శిఖర్ ధావన్ ఓటయ్యాడు. తద్వారా వన్డేల్లో 90లలో అవుటైన వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీల రికార్డును ధావన్ సమం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే(India vs England 1st ODI)లో 98 పరుగులకు ఔట్ కావడం ద్వారా.. వన్డేల్లో తొంబైలలో సెహ్వాగ్, విరాట్ కోహ్లీ 6 పర్యాయాలు ఔట్ కాగా, తాజాగా ఆ జాబితాలో ధావన్ చేరిపోయాడు.
Also Read: Ind vs Eng 1st ODI : ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం.. మ్యాచ్‌ని మలుపు తిప్పిందెవరంటే..
వన్డేల్లో అత్యధికంగా 18 పర్యాయాలు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) వికెట్ చేజార్చుకున్నాడు. అందులో అధిక మ్యాచ్‌లు భారత్ విజయాన్ని అందుకోవడం గమనార్హం. మాజీ కెప్టెన్ అజారుద్దీన్ 7 సార్లు 90లలో ఔటయ్యాడు. మరో ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీలు సైతం 6 పర్యాయాలు 90లలో ఉండిపోయారు.
మ్యాచ్ అనంతరం ధావన్ ఏమన్నాడంటే..
టీ20 సిరీస్‌లో చోటు దక్కలేదు, అయితే ఆ కారణంగా నేను మానసికంగా సిద్ధమయ్యాను. అనుభవంతో ఒత్తిడిని జయించి కీలక ఇన్నింగ్స్ ఆడగలిగాను. ప్రతి పరిస్థితి మనకు పాజిటివ్‌గా మార్చుకునేందుకు యత్నిస్తాను. అందులో భాగంగానే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాను. అవకాశం దొరికితే ఏం చేయగలనో అది చేసి చూపించాను. స్టేడియం సీమ్, స్వింగ్‌కు బాగా అనుకూలించిందని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ శిఖర్ ధావన్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు.
Also read : India vs England 1st ODI: అరుదైన ఘనతకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook