IND vs ENG: టీమిండియాదే బ్యాటింగ్.. సీనియర్లకు చోటు! డీకేకు చోటు.. సెంచరీ హీరో ఔట్
India vs England 2nd T20I Playing 11 Out. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో టీ20 ఆరంభం కానుంది.
India vs England 2nd T20I Playing 11: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో టీ20 ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత బౌలింగ్ ఎంచున్నాడు. దాంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది. ఇంగ్లీష్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. డేవిడ్ విల్లే, రిచర్డ్ గ్లీసన్ జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ నాలుగు మార్పులు చేసింది. సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ ఆడనున్నారు.
దీపక్ హుడా స్థానంలో విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చాడు. దాంతో ఈ సెంచరీ హీరోకి నిరాశ తప్పలేదు. ప్రపంచకప్ 2022 దృష్టిలో పెట్టుకుని టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు దినేష్ కార్తీక్ జట్టులో చోటు నిలుపుకున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ బదులుగా రిషబ్ పంత్ ఆడనున్నారు. శ్రేయాస్ అయ్యర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు.
తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్.
ఇంగ్లండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్, కీపర్), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, సామ్ కరణ్, డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్‌సన్.
Also Read: Bride Viral Video: వరుడి ముందే.. వధువును పెళ్లి చేసుకున్న ప్రియుడు! చివరికి..
Also Read: India vs Zimbabwe: వచ్చే నెల జింబాబ్వేకు టీమిండియా..కెప్టెన్, కోచ్ ఎవరో తెలుసా..?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook