India vs England 3rd Test Live Streaming: అతిపెద్ద స్టేడియం మోతెరాలో ఇంగ్లాండ్, టీమిండియా జట్లు తలపడనున్నాయి. నేడు ఈ రెండు జట్ల మధ్య డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కీలకమైన మూడో టెస్టు ప్రారంభం అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా కచ్చితంగా ఈ టెస్టు మ్యాచ్‌ను నెగ్గి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకుని, 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు రెండో టెస్టు విజయం ఇచ్చిన ఉత్సాహంతో భారత క్రికెట్ జట్టు బరిలోకి దిగుతుంది. పర్యాటక జట్టు ఇంగ్లాండ్ సైతం డే నైట్ టెస్టుకు పూర్తి స్థాయిలో సన్నద్దమైనట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ కోసం ఉవ్విళ్లూరుతోంది. తొలి టెస్టులో 200 పైచిలుకు పరుగుల తేడాతో టీమిండియా పరాజయం చెందితే, రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఏకంగా 300 పైచిలుకు పరుగుల తేడాతో విరాట్ కోహ్లీ(Virat Kohli) సేన విజయదుందుబి మోగించింది.


Also Read: Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ FREE Cricket సెషన్స్, యువ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు


India vs Englang 3rd Test Live Score Link - మొబైల్ బ్రౌజర్‌లో లైవ్ స్కోరు వీక్షించవచ్చు


టీమిండియా(Team India) వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టెస్టు ఎప్పుడు ప్రారంభం అవుతుంది.? 


బుధవారం (ఫిబ్రవరి 24) నాడు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ డే నైట్ టెస్టు ప్రారంభం కానుంది.


ఏ వేధికగా మూడో టెస్టు జరుగుతుంది?
అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు జరగుతుంది


Also Read: Vijay Hazare Trophy: టీమిండియా పేసర్ Sreesanth, 15 ఏళ్ల తరువాత అరుదైన ఘనత


ఈ టెస్టు మ్యాచ్ ఏ టీవీ ఛానల్‌లో  వీక్షించవచ్చు?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానల్స్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ వీక్షించవచ్చు


ఈ టెస్టు మ్యాచ్‌ను ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ఎలా వీక్షించాలి.?
డిస్నీ + హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లలో టెస్టు మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి.


భారత్ జట్టు అంచనా
విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రిషబ్ పంత్(కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ


Also Read: IPL 2021 Latest News: కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ 2021 నిర్వహించాలని యోచిస్తున్న BCCI


ఇంగ్టాండ్ జట్టు అంచనా
జో రూట్, డోమినిక్ సిబ్లీ, రోరీ బర్న్స్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(కీపర్), ఓలీ పోప్, డామ్ బెస్, జాక్ లీచ్, జోఫ్రా ఆర్చర్, జేమ్స్ అండర్సన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook