India Vs England Test Series రేపు హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు మెుదలుకానుంది. తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయంలో నెట్టింట జోరుగా చర్చ జరిగింది. కోహ్లీ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకున్నట్లు తెలుస్తోంది. విరాట్ ప్లేస్ లో ఆర్సీబీ ప్లేయర్ రజత పటిదార్‌ను ఎంపిక చేసిన‌ట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ ద్వారా ర‌జ‌త్ ప‌టిదార్ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో అత‌ను 137.50 స్ట్ర‌యిక్ రేట్‌తో 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ లయ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా ఏ త‌ర‌పున బరిలోకి దిగాడు రజత్. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న అతడు ఇంగ్లాండ్ తో సిరీస్ లో కీ రోల్ పోషించే అవకాశం ఉంది. ఇతడికి ఐపీఎల్ లో కూడా మంచి రికార్డే ఉంది. 12 మ్యాచులు ఆడిన పటిదార్ 40.4 యావ‌రేజ్‌తో 404 పరుగులు చేశాడు. 


Also Read: BCCI Awards: రవిశాస్త్రి, శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ అవార్డులు


అయితే కోహ్లీ రీప్లేస్ మెంట్ గా పలువురు పేర్లు వినిపించాయి. సీనియర్ ఆటగాళ్లైన పూజారా, రహానే, యువ ఆటగాళ్లైన సర్ఫరాజ్ ఖాన్, పటిదార్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే మేనెజ్ మెంట్ రజత్ వైపే మెుగ్గుచూపినట్లు తెలుస్తోంది. మంగళవారం బీసీసీఐ నిర్వహించిన అవార్డుల వేడుకకు పటీదార్ హాజరవ్వడం దీనికి మరింత బలం చేకూర్చింది. 


Also Read: Test Team of Year 2023: ఐసీసీ టెస్టు టీమ్ లో రోహిత్, కోహ్లీలకు దక్కని చోటు.. భారత్ నుంచి ఆ ఇద్దరూ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter