BCCI Awards: రవిశాస్త్రి, శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ అవార్డులు

BCCI Awards: బీసీసీఐ అవార్డులను ప్రకటించింది. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'తో సత్కరించనుంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోనున్నాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 09:46 PM IST
BCCI Awards: రవిశాస్త్రి, శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ అవార్డులు

BCCI Awards 2023: టీమిండియా దిగ్గజ ఆటగాడు మరియు మాజీ కోచ్ రవిశాస్త్రిని 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'తో సత్కరించనుంది బీసీసీఐ. అంతేకాకుండా 2023 ఉత్తమ క్రికెటర్‌గా శుభమాన్ గిల్ ఎంపిక చేసింది. ఈ అవార్డులను బీసీసీఐ 2019 నుంచి ఇస్తుంది. గురువారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే మొదటి టెస్ట్‌కు ముందు జరిగే ఈ వేడుకకు టీమిండియా క్రికెటర్లతోపాటు ఇంగ్లండ్ ఫ్లేయర్లు కూడా హాజరుకానున్నారు. 

61 ఏళ్ల శాస్త్రి 80 టెస్టులు, 150 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత వ్యాఖ్యాతగా తనదైన ముద్ర వేశాడు. ఆ తర్వాత టీమిండియా కోచ్ పదవిని చేపట్టి మన జట్టును విజయపథంలో నడిపాడు. 2014 నుండి 2016 వరకు నేషనల్ టీమ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. అనంతరం 2017 నుండి 2021 టీ20 ప్రపంచకప్ వరకు కోచ్ గా కొనసాగాడు. రవిశాస్త్రి సారథ్యంలో ఆస్ట్రేలియాలో భారత్ వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది. శాస్త్రి మార్గదర్శకత్వంలోనే భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది, అయితే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 2019లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో కూడా భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. 

Also Read: ICC: 2023 వన్డే అత్యుత్తమ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టాప్-11లో ఆరుగురు మనోళ్లే..

గతేడాది వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో గిల్ 2023లో 5 సెంచరీలు చేశాడు. అతను తన కెరీర్‌లో ఇప్పటివరకు భారత్ తరఫున 20 టెస్టులు, 44 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన అతికొద్ది మంది క్రికెటర్లలో ఇతను కూడా ఒకరు. గిల్ ఇప్పటివరకు 20 టెస్టుల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 1040 పరుగులు చేశాడు. 44 వన్డే మ్యాచ్‌లలో 6 సెంచరీలు మరియు 13 అర్ధ సెంచరీల సహాయంతో 2271 పరుగులు... 14 టీ20 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ మరియు 1 హాఫ్ సెంచరీ సహాయంతో 335 పరుగులు చేశాడు.

Also Read: Test Team of Year 2023: ఐసీసీ టెస్టు టీమ్ లో రోహిత్, కోహ్లీలకు దక్కని చోటు.. భారత్ నుంచి ఆ ఇద్దరూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News