Team India Head Coach Rahul Dravid's Bowling video viral: భారత్, న్యూజిలాండ్​ (India Vs New Zealand) జట్ల మధ్య జరగబోయే రెండు మ్యాచుల టెస్టు సిరీస్​కు రంగం సిద్ధమైంది. గురువారం కాన్పుర్ (Kanpur) వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే టీ20 సిరీస్ (Paytm T20 Series) కైవసం చేసుకున్న టీమిండియా.. టెస్ట్ సిరీస్ కూడా కొట్టాలని చూస్తుంది. దాంతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి కొంతైనా బదులు తీర్చుకోవాలనుకుంటోంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో స్పీడ్‌ పెంచారు. టీమిండియా కొత్త కోచ్ (Team India Head Couch) రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పర్యవేక్షణలో భారత ఆటగాళ్లు నెట్స్​లో చెమటోడుస్తున్నారు.


Also Read: Tomato Price Increased: 20 రోజుల్లో లక్షాధికారిని చేసిన టమోటా.. ఇప్పటి వరకు రూ. 80 లక్షలపైనే...


తొలి టెస్ట్ కోసం నెట్స్​లో బ్యాటింగ్ చేస్తున్న భారత బ్యాటర్లకు కోచ్ రాహుల్ ద్రవిడ్ తన స్పిన్ బౌలింగ్​తో (Rahul Dravid Spin bowling) సవాల్ విసిరాడు. ఆఫ్ స్పిన్ బంతులను బ్యాటర్లకు సంధించాడు. వాటిని ఎదుర్కొనడంపై మెళకువలను నేర్పించాడు. అజింక్య రహానే (Ajinkya Rahane), చటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) వంటి సీనియర్లు.. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer), శుభ్​మన్ గిల్ (Shubhman Gill), కేఎస్ భరత్ లాంటి జూనియర్లు ద్రవిడ్ వేసిన బంతులను ఎదుర్కొన్నారు.


ప్రాక్టీస్‌లో భాగంగా స్పిన్నర్‌ అవతారమెత్తిన ద్రవిడ్‌.. భారత ఆటగాళ్లకు బంతులు విసరడం వైరల్‌గా మారింది. ద్రవిడ్ బౌలింగ్‌కు సంబందించిన వీడియోను బీసీసీఐ (BCCI) పోస్ట్ చేయగా.. అదికాస్త క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన ఫాన్స్ టీమిండియా (Team India) కోచ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  'బౌలింగ్ మాములుగా లేదుగా', 'రాహుల్ ద్రవిడ్ సర్.. మీరు తోపు' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 




Also Read: Bank Holidays: డిసెంబర్‌లో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. అవేంటో మీరే చూడండి!


టీమిండియా హెడ్ కోచ్ బౌలింగ్ చేయడం చాలా అరుదుగా చెప్పవచ్చు. రాహుల్ ద్రవిడ్ కంటే ముందు ఈ స్థానంలో కొనసాగిన రవిశాస్త్రి (Ravi Shastri) పెద్దగా బౌలింగ్ చేసిన సందర్భాలు లేవు. నెట్ ప్రాక్టీస్ సమయంలో ప్లేయర్లకు సూచనలు ఇవ్వడం, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించడం, ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌లను చేయించడం మనం చూసాం.


అయితే శాస్త్రి స్వయనా ఆఫ్ స్పిన్నర్ అయినా బంతిని అందుకున్నది వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. దీనికి భిన్నంగా బ్యాటర్ అయిన ద్రవిడ్.. ఏకంగా బౌలింగ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. కోచ్‌గా అపాయింట్ అయిన తరువాత టీమిండియా ఎదుర్కొన్న మొట్టమొదటి సిరీస్ చిరస్మరణీయంగా మారింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ అలవోకగా గెలిచింది. 


Also Read: Bumper Offer: రూ. 19,900 ధర గల Samsung 32-ఇంచెస్ TV.. కేవలం రూ. 5,240కే.. త్వరపడండి!


కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత జట్టు చివరిసారిగా 2016లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. 2016లో న్యూజిలాండ్ (New Zealand) జట్టునే ఢీ కొట్టి విజయాన్ని అందుకుంది. అప్పుడు 216 పరుగుల భారీ తేడాతో బ్లాక్ క్యాప్స్‌ను (Black Caps) ఓడించింది. కివీస్‌ టీమ్‌కు (Kiwis Team) ఏ మాత్రం అచ్చిరాని పిచ్ ఇది. ఈ స్టేడియంలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.


మరోవైపు ఈ పిచ్ టీమిండియాకు మాత్రం బాగా అచ్చొచ్చింది. మొత్తం 22 టెస్ట్ మ్యాచ్‌లు ఇక్కడ జరగ్గా.. ఏడింట్లో భారత్ విజయం సాధించింది. మూడింట్లో ఓడి.. మిగిలిన 12 మ్యాచ్‌లు డ్రాగా ముగించింది. ఈసారి కూడా ఆ ట్రాక్ రికార్డును కొనసాగించాలని భారత్ చూస్తోంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి