ఇండియా vs న్యూజీలాండ్ 2వ టీ20: కివీస్ నడ్డి విరిచిన కృనాల్ పాండ్య
ఇండియా vs న్యూజీలాండ్ 2వ టీ20: కివీస్ నడ్డి విరిచిన కృనాల్ పాండ్య
ఆక్లాండ్: భారత్ - న్యూజీలాండ్ జట్ల మధ్య నేడు జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజీలాండ్ జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపింది. టిమ్ సిఫెర్ట్, కొలిన్ మున్రో కివీస్ తరపున ఓపెనింగ్ కి దిగగా భారత్ తరపున భువనేశ్వర్ తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్ లో ఒక వైడ్ సహా మొత్తం మూడు పరుగులు ఇచ్చిన భువి మూడో ఓవర్ లో రెండోసారి బౌలింగ్ కి వచ్చి సీఫెర్ట్(12) వికెట్ తీశాడు. స్టంప్స్ కి సమీపంగా వచ్చిన బంతి ఎడ్జ్ తగలగా ఆ వెనకే వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఆ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో 3 ఓవర్లకు కివీస్ జట్టు 17 పరుగుల వద్ద వుండగా తొలి వికెట్ పడింది.
ఆ తర్వాత 6వ ఓవర్‌లో మరో ఓపెనర్ కొలిన్ మున్రో సైతం 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కృనాల్ పాండ్య విసిరిన బంతిని హిట్ ఇవ్వబోయి కెప్టేన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో అప్పటికి జట్టు స్కోర్ 42 వుండగా ఆ తర్వాత మున్రో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మిచెల్(1)ను సైతం కృనాల్ అదే ఓవర్‌లో పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో 6 ఓవర్లలో 43 పరుగులకే కివీస్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 8వ ఓవర్ లో రెండోసారి బౌలింగ్ కి వచ్చిన కృనాల్ అదే జోష్‌లో కివీస్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్(20)ను ఔట్ చేసి కివీస్ నడ్డి విరిచాడు. మొత్తంగా కివీస్ జట్టు స్కోర్ 10.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.