India Vs Pakistan World Cup 2023: పాకిస్థాన్‌పై భారత్ భారీ విజయంతో టీమిండియా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఉత్కంఠభరితంగా మ్యాచ్‌ సాగుతుందనుకుంటే.. పాకిస్థాన్ జట్టు పసికూన కంటే దారుణంగా టీమిండియా ముందు లొంగిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. 191 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలతో చెలరేగి జట్టును గెలిపించారు. బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్ మినహా.. మిగిలిన వారందరూ తలో రెండు వికెట్లు తీశారు. ప్రపంచకప్‌లో తర్వాతి మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక పాక్ మ్యాచ్‌లో హర్థిక్ పాండ్యాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బంతికి ఏదో చెప్పి మరీ వికెట్ తీయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు శ్రీలంకపై సెంచరీతో పాక్ ఓపెనర్ ఇమామ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ 36 పరుగులతో క్రీజ్‌లో బాగా స్థిరపడ్డాడు. అయితే అతను ఔట్ అయిన దానికంటే.. డెలివరీకి ముందు చేసిన చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


 




13వ ఓవర్ మూడో బంతికి ఇమామ్ హార్దిక్ వేసిన షార్ట్ అండ్ వైడ్ డెలివరీని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా బౌండరీకి తరలించాడు. నాలుగో బాల్ వేసే ముందు బంతితో ఏదో చెప్పాడు. అంతే ఇమామ్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. బ్యాక్ ఫుట్ నుంచి డ్రైవ్ చేసే ప్రయత్నంలో ఆఫ్ స్టంప్ వెలుపల పడిన బంతిని ఆడగా.. ఎడ్జ్ తీసుకోవడం కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. ఆ డెలివరీని బౌల్ చేయడానికి ముందు హార్దిక్ చేసిన పని అభిమానులను ఆకట్టుకుంటోంది. హార్దిక్ చేతిలో బంతిని పట్టుకుని.. వికెట్ తీయడానికి ముందు కొన్ని మాటలు మాట్లాడటం నవ్వు తెప్పిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో పాండ్యా రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.  


మ్యాచ్‌ ముగిసిన అనంతరం బాల్‌తో చెప్పిన మాటలను పాండ్యా వెల్లడించాడు. బెటర్ లెంగ్త్ వేయడం కోసం తనను తాను తిట్టుకున్నానని చెప్పాడు. 132,000 మంది సామర్థ్యం కలిగిన అహ్మదాబాద్ స్టేడియంలో భారత్ అద్భుత విజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 


Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు


Also Read: Motorola Edge 40 Neo Price: పిచ్చెకించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola Edge 40 Neo మొబైల్..డెడ్‌ చీప్‌ ధరకే మీ కోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి