ICC ODI World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ రీషెడ్యూల్ .. కారణం ఏంటంటే?
India vs Pakistan: త్వరలో ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ లో భారత్-పాక్ అక్టోబరు 15న తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాయాదుల పోరు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ODI World Cup 2023: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి క్రికెట్ వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ లో భారత్-పాక్ లు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరు. దాయాదుల మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ (India vs Pakistan) మ్యాచ్ అక్టోబరు 15న ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు క్రికెట్ లవర్స్ కు ఐసీసీ ఓ పెద్ద షాక్ ఇవ్వనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం, ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబరు 15న వేదికగా జరగాల్సి ఉంది. అయితే అదే రోజు గుజరాత్ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు మెుదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో మ్యాచ్ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐ(BCCI)కి సూచించినట్లు ఓ ఆంగ్ల పత్రిక స్టోరీ రాసింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని బీసీసీఐ అధికారులు చెప్పినట్లు వెల్లడించింది.
''ఓ పక్క నవరాత్రి ఉత్సవాలు, మరోపక్క మ్యాచ్ కారణంగా తమపై భారం పెరుగుతుందని సెక్యూరిటీ ఏజెన్సీలు మాకు సూచనలు చేశాయి. అందుకే దీనిపై మా దగ్గరున్న అన్ని ఆప్షన్లు గురించి ఆలోచిస్తున్నాం'' అని బీసీసీఐ ఉన్నతాధికారులు మీడియా చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు ప్రపంచకప్ మ్యాచ్ లు నిర్వహించే రాష్ట్ర సంఘాలు జూలై 27న రాజధాని ఢిల్లీలో సమావేశం కావాలని బీసీసీఐ కార్యదర్శి జైషా సూచించారు. భారత్-పాక్ మ్యాచ్ కు సంబంధించిన నిర్ణయం ఈ మ్యాచ్ లో తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ మ్యాచ్ ను ఆక్టోబరు 14న నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: IND A vs PAK A Asia Cup 2023: ఫైనల్లో యువ భారత్ చిత్తు.. ఛాంపియన్‌గా పాకిస్థాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook