Ind vs SA ODI Series 2023: దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా వన్డే సమరానికి సిద్ధమౌతోంది. టీ20 సిరీస్ సమం కావడంతో వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు రెండు జట్లు తీవ్రంగా ప్రయత్నించనున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో ఇవాళ తొలి వన్డే మ్యాచ్ జోహాన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్డేడియంలో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మద్యాహ్నం 1.30 గంటల్నించి ప్రత్యక్ష ప్రసారం కానుంది. 3 టీ20ల సిరీస్‌లో మొదటిది వర్షం కారణంగా రద్దు కావడంతో మిగిలిన రెండు మ్యాచ్‌లు 1-1 తో ముగిశాయి. అందుకో వన్డే సిరీస్ కూడా సమం కాకుండా కైవసం చేసుకునేందుకు రెండు జట్లు ప్రయత్నించనున్నాయి. రెండు జట్లు కీలకమైన మార్పులతో బరిలో దిగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్‌లకు ఆస్కారముంటుంది. సంజూ శామ్సన్‌కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా మరో అవకాశంగా ఉన్నాడు. గతంలో కూడా వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు వహించిన కేఎల్ రాహుల్‌కు ఇదే మంచి అవకాశం. సిరీస్ కైవసం చేసుకుంటే కేఎల్ రాహుల్‌కు కెప్టెన్ గా భవిష్యత్ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బూమ్రాలు అందుబాటులో లేకపోవడంతో ముకేశ్ కుమార్, అర్షదీప్, అవేశ్ ఖాన్‌లపై భారం ఉంటుంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, చహర్‌లలో ఎవరు ఆడతారో చూడాలి. 


అటు దక్షిణాఫ్రికా మార్క్‌రమ్ నేతృత్వంలోనే బరిలో దిగనుంది. మిల్లర్, క్లాసెన్, మార్క్‌రమ్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. మరో ఓపెనర్ రీజా హెన్‌డ్రిక్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక బౌలింగ్ పరంగా పరిశీలిస్తే విలియమ్స్, బర్జర్, ముల్దర్‌లు ఎలా రాణిస్తారనేది ఆసక్తిగా మారింది. సఫారీల గడ్డపై ఆ దేశాన్ని ఓడించడం కష్టమే అయినా బ్యాటింగ్ పరంగా పటిష్టమైన లైనప్ కలిగిన భారత జట్టుకు వన్డే సిరీస్ కైవసం చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. 


పిచ్ రిపోర్ట్


జోహాన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలంగా ఉంంటుంది. ఈ పిచ్‌పై గతంలో జరిగిన నాలుగు వన్డేల్లో మూడుసార్లు 300 దాటి స్కోర్ నమోదైంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవచ్చు. వర్షసూచన లేకున్నా మొన్నటి వరకూ కురిసిన వర్షాల కారణంగా గాలిలోని తేమ బౌలర్లకు కూడా అనుకూలం కావచ్చు.


ఇండియా దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకూ 91 వన్డేలు జరగగా అందులో 50 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే టీమ్ ఇండియా 38 గెలిచింది. మూడు వన్డేలు ఏ ఫలితం లేకుండా ముగిశాయి. ఇండియాపై సఫారీలు తమ సొంత గడ్డపై 25 వన్డేల్లో విజయం సాధించడం గమనార్హం. 


Also read: India Vs South Africa: టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బౌలర్లు దూరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook