Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్.. 55 రన్స్‌కే సౌతాఫ్రికా ఆలౌట్
India Vs South Africa 2nd Test Score: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగిన వేళ.. కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. బుమ్రా, ముఖేష్ కుమార్ తలో రెండు వికెట్లతో సిరాజ్‌కు సహకారం అందించారు.
India Vs South Africa 2nd Test Score: తొలి టెస్టులో చేతులేత్తిసిన బౌలర్లు.. రెండో టెస్టులో చెలరేగారు. కేప్‌టౌన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను కేవలం 55 పరుగులకే కుప్పకుల్చారు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. భారత బౌలర్ల ధాటికి కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండెంకెల స్కోరును దాటారు. కైల్ వెర్రెయిన్ అత్యధికంగా 15 పరుగులు చేశాడు. సిరాజ్‌కు తోడో జస్ప్రీత్ బుమ్రా,ముఖేష్ కుమార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
మొదట ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీ బ్యాట్స్‌మెన్‌కు సిరాజ్ ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. మార్క్రమ్ (2)ను ఔట్ చేసి శుభారంభం అందించాడు. కాసేపటికే సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ఎల్గర్ (4)ను పెవిలియన్‌కు పంపించి దెబ్బ తీయగా.. అనంతరం స్టబ్స్ (3) బుమ్రా ఔట్ చేశాడు. టోనీ జార్జి (2)ను సిరాజ్ ఔట్ చేయడంతో 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డేవిడ్ బెడింగ్‌హామ్ (12), కైలీ వెరీ (15) కాసేపు క్రీజ్‌లో కుదురుకున్నా.. సిరాజ్ మళ్లీ దెబ్బ తీశాడు. బెడింగ్ హోమ్, మార్కో జాన్సన్ (0)లను ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. కేశవ్ మహరాజ్ (3), రబాడ (5), బర్గర్ (4)లు కూడా తక్కువ స్కోర్లకే ఔట్ అవ్వడంతో సఫారీ టీమ్ 55 పరుగులకే ఆలౌట్ అయింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు కూడా మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. యశస్వి జైస్వాల్ (0)ను రబాడ డకౌట్ చేశాడు. రోహిత్ శర్మ (38), శుభ్‌మన్ గిల్ (6) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. 10 ఓవర్లలోనే 58 పరుగులు చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter