Bhuvneshwar Kumar T20 Record: మరొక్క వికెటే.. టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న భువనేశ్వర్ కుమార్!
India vs South Africa 3rd T20I. Bhuvneshwar Kumar eye on huge T20I record. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.
Bhuvneshwar Kumar on the cusp of registering a huge T20I record: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 6.30 గంటలకు టాస్ పడనుండగా.. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోయిన పంత్ సేన.. సిరీస్‌లో నిలువాలంటే మూడో టీ20లో తప్పక గెలువాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సిరీస్ ఇక్కడే పట్టేయాలని ప్రొటీస్ చూస్తోంది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టీ20లో భువీ పవర్ ప్లేలో మరొక్క వికెట్ పడగొడితే.. పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన అంతర్జాతీయ టీ20 బౌలర్‌గా నిలుస్తాడు. కటక్ వేదికగా జరిగిన రెండో టీ20లో భువనేశ్వర్ తన కోటా 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు వికెట్లలో మూడు వికెట్లు పవర్ ప్లేలోనే వచ్చాయి. దీంతో టీ20 పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సామ్యూల్ బద్రీ, టిమ్ సౌథీ సరసన భువీ నిలిచాడు.
ప్రస్తుతం సామ్యూల్ బద్రీ, టిమ్ సౌథీ, భువనేశ్వర్ కుమార్.. టీ20 పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ ముగ్గురూ తలా 33 వికెట్లు పడగొట్టారు. బద్రీ 50 ఇన్నింగ్స్‌ల్లో 33 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉండగా.. భువనేశ్వర్ 59 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. సౌథీ 68 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో నిలిచాడు. షకిబ్ అల్ హసన్ 58 ఇన్నింగ్స్‌ల్లో 27 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో ఉండగా.. జోష్ హేజిల్‌వుడ్ 30 ఇన్నింగ్స్‌ల్లో 26 వికెట్లు ఐదో స్థానంలో ఉన్నాడు.
Also Read: భారీగా పెంచేసిన నజ్రియా నజీమ్.. స్టార్ హీరోయిన్‌లకు సమానంగా!
Also Read: Meera Jasmine: మీరా జాస్మిన్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు.. హాట్ హాట్‌గా కనిపిస్తోన్న అందాల భామ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook