Nazriya Nazim Remuneration: భారీ స్థాయిలో న‌జ్రియా న‌జీమ్ రెమ్యున‌రేష‌న్.. స్టార్ హీరోయిన్‌లకు సమానంగా!

Nazriya Nazim Remuneration for Ante sundaraniki Movie. అంటే సుంద‌రానికి సినిమా కోసం న‌జ్రియా న‌జీమ్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అయింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2022, 06:26 PM IST
  • జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు అంటే సుందరానికి
  • భారీ స్థాయిలో న‌జ్రియా న‌జీమ్ రెమ్యున‌రేష‌న్
  • స్టార్ హీరోయిన్‌లకు సమానంగా
Nazriya Nazim Remuneration: భారీ స్థాయిలో న‌జ్రియా న‌జీమ్ రెమ్యున‌రేష‌న్.. స్టార్ హీరోయిన్‌లకు సమానంగా!

Nazriya Nazim Remuneration for Ante sundaraniki Movie: టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని, మలయాళీ బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన సినిమా 'అంటే సుంద‌రానికి'. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ చిత్రంను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. జూన్‌ 10న తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ భాషల్లో 'అంటే సుందరానికి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొద‌టి రోజు నుంచి పాజిటీవ్ టాక్ ఉన్నా.. కలెక్ష‌న్ల‌లో మాత్రం జోరు చూపించ‌లేక‌పోయింది.

అంటే సుంద‌రానికి చిత్రంలో నాని, న‌జ్రియా న‌జీమ్ త‌మత‌మ పాత్ర‌ల్లో జీవించారు. వీరిద్దరి జోడి చాలా బాగుంది. సినిమా ఆరంభం నుంచి చివరి వ‌ర‌కు వీరి మధ్య వచ్చే సీన్స్ ఎక్క‌డా బోర్ కొట్ట‌లేదు. ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోలేకపోయినా.. సెకండ్ హాఫ్ బాగుండడంతో సినిమా సక్సెస్ అయింది. ఫ‌స్ట్ వీకెండ్ పూర్త‌య్యేసరికి ఈ సినిమా దాదాపు రూ.15 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం మ‌రో రూ.16 కోట్లు రావాల్సి ఉంది. 

అయితే అంటే సుంద‌రానికి సినిమా కోసం న‌జ్రియా న‌జీమ్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అయింది. నజ్రియా ఈ సినిమా కోసం ఏకంగా  రూ. 2 కోట్ల పారితోషికం తీసుకుంద‌ని స‌మాచారం తెలుస్తోంది. అంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లకు సామానంగా మలయాళీ బ్యూటీ రెమ్యున‌రేష‌న్ తీసుకుందన్నమాట. రష్మిక మందన్న, పూజాహెగ్డే, కీర్తి సురేష్, సమంత, కాజల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ భారీ మొత్తంలో తీసుకుంటున్న విషయం తెలిసిందే. న‌జ్రియాకు ఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. 

'రాజా రాణి' సినిమాతో న‌జ్రియా న‌జిమ్‌ తెలుగు ప్రేక్ష‌కుల‌కు దగ్గరయ్యారు.  హీరో ఆర్యను బ్ర‌ద‌ర్, బ్ర‌ద‌ర్ అంటూ.. క్యూట్ ఎక్స్‌ప్రేష‌న్స్‌తో యువతలో మంచి ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకున్నారు. ఆ సినిమాలో తన అందం, నటనతో అందరి మనసులను కొల్లగొట్టారు. రాజా రాణి సినిమా త‌ర్వాత న‌జ్రియా నేరుగా తెలుగులో ఎప్పుడు న‌టిస్తుందాని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. చివరకు నాని పట్టుబట్టి మరీ 'అంటే సుంద‌రానికి' సినిమాలో హీరోయిన్‌గా నటించేలా ఒప్పించాడు. 

Also Read: Jinnah Movie: వివాదంలో మంచు విష్ణు సినిమా.. టైటిల్‌పై బీజేపీ అభ్యంతరం! కోన వెంకట్‌ ఏమంటున్నారంటే

Also Read: Anushka Sharma Pregnant: చెకప్ కోసం హాస్పిటల్‌కు.. అనుష్క మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుందా?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News