Team India`s Lunch Menu Goes Viral : మ్యాచ్ రద్దు.. టీమిండియా లంచ్ మెనూ వైరల్..
India vs South Africa: Team India`s Lunch Menu Goes Viral : టీమిండియా రెండో రోజు లంచ్ సెషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు హల్ చల్ చేస్తున్నాయి. ఆడడానికి ఎలాగో అవకాశం లేదు.. సరే.. తినడానికి మంచి మెనూ ఉంది..కానిద్దాం పదండి అన్నట్లుగా సోషల్ మీడియాలో టీమిండియాపై కొన్ని పోస్ట్స్ వైరల్ అయ్యాయి.
India vs South Africa: "Broccoli Soup, Chicken Chettinad" Team India's Lunch Menu On Day 2 Goes Viral : భారత్, సౌత్ ఆఫ్రికా (South Africa) జట్ల మధ్య సెంచూరియన్‌లో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ( Day 2) ఆట వర్షం వల్ల రద్దయింది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో.. ఉదయం సెషన్‌లో ఆట కొనసాగలేదు. ఇక లంచ్ తర్వాత ఆట కొనసాగుతుందని ఆశించినా.. గ్రౌండ్‌లో నీరు నిలిచిపోవడంతో ఆట మొదలుకాలేదు. తర్వాత మళ్లీ వర్షం పడడం వల్ల మైదానం మొత్తం చెరువులా మారింది.
అయితే టీమిండియా రెండో రోజు లంచ్ సెషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు హల్ చల్ చేస్తున్నాయి. ఆడడానికి ఎలాగో అవకాశం లేదు.. సరే.. తినడానికి మంచి మెనూ ఉంది..కానిద్దాం పదండి అన్నట్లుగా సోషల్ మీడియాలో టీమిండియాపై కొన్ని పోస్ట్స్ వైరల్ అయ్యాయి. 2వ రోజు ఫుల్ వర్షం వల్ల మ్యాచ్ రద్దయింది కానీ.. విరాట్ కోహ్లి (Virat Kohli) టీమ్‌కు మాత్రం లంచ్‌లో మంచి రుచికరమైన భారతీయ వంటకాలను తినే ఛాన్స్ లభించింది.
చికెన్ చెట్టినాడ్ (Chicken Chettinad) నుంచి బ్రోకలీ సూప్ (Broccoli soup) వరకు, వెజిటబుల్ కడాయి ( Vegetable Kadai) నుంచి లాంబ్ చాప్స్ (Lamb Chops) వరకు టీమిండియా (Team India) లంచ్ మెనూలో ఉన్నాయి.
Also Read : Omicron Scare: రాష్ట్రంలో మరో 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్- మొత్తం కేసులు @ 55
లంచ్ విరామం తర్వాత పిచ్‌ను పరిశీలించిన అంపైర్స్ రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తొలిరోజు 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ (122), (KL Rahul) అజింక్యా రహానే (40) (Ajinkya Rahane) స్కోర్‌తో క్రీజ్‌లో ఉండగా, మయాంక్ అగర్వాల్ (60), (Mayank Agarwal) పుజారా (0), కెప్టెన్ కోహ్లీ(35) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్ లుంగీ ఎన్గిడి 3 వికెట్లు దక్కించుకున్నారు.
Also Read : Financial Things to do: డిసెంబర్ 31 సమీపిస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook